DC vs RR, IPL 2024: దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్‌

Delhi Capitals Vs Rajasthan Royals: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. మంగళవారం (మే 06) రాజస్థాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఓపెనర్లు మెక్ ఫ్రేజర్‌ గర్క్

DC vs RR, IPL 2024: దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్‌
Delhi Capitals

Updated on: May 07, 2024 | 9:42 PM

Delhi Capitals Vs Rajasthan Royals: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. మంగళవారం (మే 06) రాజస్థాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఓపెనర్లు మెక్ ఫ్రేజర్‌ గర్క్ (20 బంతుల్లో 50, 7 ఫోర్లు, 3 సిక్స్ లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్స్ లు) ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఆఖరులో ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41, 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి నష్టానికి 221 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (15), రిషభ్‌ (15), నబీ (19), సేలమ్‌ (9) విఫలమయ్యారు.  కుల్‌దీప్‌ (5*) నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో  రవి చంద్రన్ అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌, సందీప్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

ఢిల్లీ ఓపెనర్ల విధ్వంసం..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్, కునాల్ సింగ్ రాథోర్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్  అండ్ వికెట్ కీపర్ ), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..