IPL 2024: కింగ్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విరాట్‌కే మళ్లీ ఆర్సీబీ పగ్గాలు.. ఈ సీజన్‌లోనే
ఐపీఎల్‌లో ది మోస్ట్ పాపులర్ టీం అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెల్చుకోకున్నా ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో మాత్రం బెంగళూరు జట్టు తరచూ విఫలమవుతోంది.
ఐపీఎల్‌లో ది మోస్ట్ పాపులర్ టీం అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెల్చుకోకున్నా ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో మాత్రం బెంగళూరు జట్టు తరచూ విఫలమవుతోంది. దీంతో గత 16 సీజన్లుగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలన్న కల కలగానే ఉండిపోతుంది. ముఖ్యంగా గత సీజన్‌లో RCB 14 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో మరోసారి RCB కెప్టెన్సీపై అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయింది. ఫలితంగా 2019 తర్వాత తొలిసారిగా ఆర్‌సీబీ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఈ ఐపీఎల్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ బరిలోకి దిగుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత రెండు సీజన్లలో డుప్లెసిస్ RCB జట్టుకు నాయకత్వం వహించాడు. ఫాఫ్ నేతృత్వంలో మొత్తం 27 మ్యాచ్‌లు ఆడగా, RCB 14 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచుల్లో ఓడిపోయింది. డుప్లెసిస్ గైర్హాజరీలో విరాట్ కోహ్లి గత సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను తన దూకుడైన కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందా అనే చర్చ మొదలైంది.
గతంలో కెప్టెన్సీ భారం కారణంగా విరాట్ కోహ్లీ RCB జట్టు సారథ్యం నుండి తప్పుకున్నాడు. ఆ సమయంలో అటు భారత జట్టును, ఆర్సీబీని నడిపించడం విరాట్ కు భారంగా మారింది. అందుకే లీగ్ క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. టీమిండియా మూడు జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లి నాయకత్వంలో RCB 3 సార్లు ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. 39 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్ రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారు. ఇన్ని కారణాల వల్ల ఈ ఐపీఎల్‌లో మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..