AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా’! ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. బౌలింగ్ లోనూ రాణిస్తూ వరుసగా విజయాలు సాధిస్తోంది. గత మూడేళ్లుగా ప్లే ఆఫ్స్ కు చేరుకోలేక, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడిన ఎస్ ఆర్ హెచ్ ఈ సీజన్ లో టైటిల్‌ ఫేవరేట్ గా నిలిచింది.

IPL 2024: 'నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా'! ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్
SRH captain Pat Cummins
Basha Shek
|

Updated on: May 18, 2024 | 6:49 PM

Share

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. బౌలింగ్ లోనూ రాణిస్తూ వరుసగా విజయాలు సాధిస్తోంది. గత మూడేళ్లుగా ప్లే ఆఫ్స్ కు చేరుకోలేక, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడిన ఎస్ ఆర్ హెచ్ ఈ సీజన్ లో టైటిల్‌ ఫేవరేట్ గా నిలిచింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా టాప్ – 2 కు చేరుకుంటోంది. దీంతో ఎస్ ఆర్ హెచ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగించి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఎస్ఆర్‌హెచ్ ఈ రేంజ్‌లో దూకుడుగా ఆడడానికి కారణం కెప్టెన్ కమిన్స్ కూడా ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ ను విశ్వవిజేతగా నిలిపిన కమిన్స్ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ను కూడా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టడంలో తన వంతు కృషి చేస్తున్నాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు కమిన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా మరో మంచి పని చేసి అభిమానుల హృదయాలు గెల్చుకున్నాడీ ఆసీస్ కెప్టెన్.

వివరాల్లోకి ఎస్‌ఆర్‌హెచ్ తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఆదివారం (మే19) ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్ కు ముందు కాస్త విశ్రాంతి తీసుకున్నాడు కెప్టెన్ కమిన్స్. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్కడి పాఠశాల మైదానంలో విద్యార్థులతో సరదాగా క్రికెట్ ఆడాడు. కొంతమంది పిల్లలు కమిన్స్ కు బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ ​ వికెట్ కీపింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ తమతో కలిసిపోయి క్రికెట్ ఆడడంపై పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

స్కూల్ పిల్లలతో క్రికెట్ ఆడుతోన్న కమిన్స్.. వీడియో

ఇది చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘ఛాంపియన్ ప్లేయర్ తో క్రికెట్ ఆడడం ఆ పిల్లలకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.’ ‘నువ్వు గ్రేట్ కమిన్స్ మావా’, ‘ విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..