IPL 2024: అడుగడుగునా గండమే.. RCB ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్‌లివే.. అన్నీ బలమైన జట్లే గురూ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచింది. పంజాబ్ కింగ్స్‌పై గెలుపు తప్పితే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు 5వ మ్యాచ్‌కు సిద్ధమైన ఆర్సీబీ.. రాబోయే మ్యాచ్‌లపై మరింత ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎదురయ్యేవన్నీ బలమైన జట్లే.

IPL 2024: అడుగడుగునా గండమే.. RCB ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్‌లివే.. అన్నీ బలమైన జట్లే గురూ..
Royal Challengers Bengaluru
Follow us
Basha Shek

|

Updated on: Apr 03, 2024 | 5:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచింది. పంజాబ్ కింగ్స్‌పై గెలుపు తప్పితే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు 5వ మ్యాచ్‌కు సిద్ధమైన ఆర్సీబీ.. రాబోయే మ్యాచ్‌లపై మరింత ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎదురయ్యేవన్నీ బలమైన జట్లే. ఈసారి ఎలాగైన ఐపీఎల్ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆడిన తొలి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇందులో సొంతగడ్డపైనే2 మ్యాచుల్లో ఓడిపోవడం ఫ్యాన్స్ కు అసలు మింగుడుపడడం లేదు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడినప్పుడు అభిమానుల నుండి భారీ మద్దతు లభిస్తుంది. అలాగే హోం గ్రౌండ్‌లో ఆడిన అనుభవం పనికొస్తుంది. అయితే, చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో RCB ఘోర పరాజయాన్ని చవిచూసింది. బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 6న ఆడనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ సొంత మైదానం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అలాగే, RCB తన తదుపరి 5 మ్యాచ్‌లలో 4 ప్రత్యర్థి హోమ్ గ్రౌండ్‌లో ఆడాల్సి ఉంది.

RCB జట్టు తదుపరి 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది…

  • RR vs RCB: ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
  • MI vs RCB: ఏప్రిల్ 11న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో RCB ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
  • RCB vs SRH: ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
  • KKR vs RCB: ఏప్రిల్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
  • SRH vs RCB: ఏప్రిల్ 25న RCB, SRH జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

అంటే వచ్చే ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ సొంతగడ్డపై కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడనుంది. మిగిలిన 4 మ్యాచ్‌లు ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలో ఆడాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన RCBకి తదుపరి 5 మ్యాచ్‌లు ముఖ్యమైనవి. ఈ మ్యాచ్‌ల్లో ఓడిపోతే ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్ంగా మారుతాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!