AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: విశాఖలో అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్.. ఎక్కడెక్కడ తిరగనున్నారంటే..

కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని, షారుఖ్ ఖాన్ విశాఖ‎లో సందడి చేశారు. ఈరోజు విశాఖ‎లో DC vs KKR ఐపిఎల్ T20 మ్యాచ్ నేపథ్యంలో తన జట్టు KKR ప్రచారంతో పాటు తన టీంకు మద్దతు ఇవ్వడానికి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షారుఖ్ విశాఖ చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్ట్‎లో షారుఖ్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు.

Watch Video: విశాఖలో అడుగుపెట్టిన షారుఖ్ ఖాన్.. ఎక్కడెక్కడ తిరగనున్నారంటే..
Sharukh Khan In Vizag
Eswar Chennupalli
| Edited By: Srikar T|

Updated on: Apr 03, 2024 | 7:28 PM

Share

కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని, షారుఖ్ ఖాన్ విశాఖ‎లో సందడి చేశారు. ఈరోజు విశాఖ‎లో DC vs KKR ఐపిఎల్ T20 మ్యాచ్ నేపథ్యంలో తన జట్టు KKR ప్రచారంతో పాటు తన టీంకు మద్దతు ఇవ్వడానికి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షారుఖ్ విశాఖ చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్ట్‎లో షారుఖ్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. చాలా గోప్యంగా ఉంచినప్పటికి షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు వారిని నిలువరించారు.

KKR టీం కు మద్దతుగా..

షారుఖ్ ఖాన్ తన KKR టీంకు మద్దతుదారుగా చెబుతారు. షారుఖ్‎కు సమయం దొరికిన ప్రతిసారీ తన టీం మ్యాచ్ ఎక్కడ ఉన్నా జట్టు సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఆ స్టేడియంకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అలానే బుధవారం షారుఖ్ విశాఖ వచ్చారు. తన టీం మెంబెర్స్‎ను ఉత్సాహపరచడమే షారుఖ్ పర్యటన ముఖ్య ఉద్దేశం అంటున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‎కు కెప్టెన్‎గా శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడంతో టీం మళ్లీ పుంజుకుంది. రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‎ను సాధించిన KKR కు శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా 2023 సీజన్‎లో తప్పుకుని తిరిగి ఈ సీజన్‎లో ఆడుతున్నారు.

షారుఖ్ ను చూడాలనుకుంటే..

ఈరోజు రాత్రి 7.30 నుంచి ప్రారంభం అయ్యే DC vs KKR మ్యాచ్ కోసం విశాఖ చేరుకున్న షారుఖ్ విమానాశ్రయం నుంచి నోవోటల్ హోటల్ చేరుకుని రాత్రి మ్యాచ్‎కు వెళ్లనున్నారు. అనంతరం తిరిగి హోటల్ చేరుకోనున్న షారుఖ్ రేపు సాయంత్రం వరకు విశాఖలోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు షారుఖ్ తిరిగి ముంబై వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..