IPL 2024: కేఎల్ రాహుల్ టీమ్‌కు ఎదురు దెబ్బ.. టోర్నీ నుంచి రూ.6.4 కోట్ల ప్లేయర్ ఔట్.. కారణమిదే
ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ధనాధన్ లీగ్ మధ్యలోనే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ధనాధన్ లీగ్ మధ్యలోనే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి మొత్తం లీగ్‌కు దూరమయ్యాడు. పక్కటెముక గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆగస్ట్ 2023 నుంచి ఈ గాయంతో బాధపడుతున్న మావి, లీగ్ ప్రారంభం నాటికి కోలుకుంటాడని భావించారు. అయితే అది సాధ్యం కాలేదు. కాగా గత ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన శివమ్ మావికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత మినీ వేలానికి ముందే గుజరాత్ జట్టు నుంచి మావి విడుదలయ్యాడు. అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ అతన్నికొనుగోలు చేసింది. మినీ వేలంలో మావిని లక్నో జట్టు రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది. అవేష్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఈ మొత్తాన్ని మావిని కొనుగోలు చేసింది. కానీ మావి ఇప్పటి వరకు లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
మావి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడన్న విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ మీడియాకు తెలియజేసింది ‘గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో మా జట్టులో చేరిన ప్రతిభావంతుడైన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి ఇప్పటివరకు మా జట్టు నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నాడు. ఈ సీజన్‌లో అతను జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని భావించాం. అయితే ఇప్పుడు అతడు అందుబాటులో లేకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నాం.
🚨 BREAKING NEWS 🗞️
Shivam Mavi ruled out of IPL 2024.‼️#ShivamMavi #MayankYadav #KLRahul #RCBvLSG #RCBvsLSG #RCB #LSG #IPL #IPL2024 #TATAIPL #TATAIPL2024 pic.twitter.com/FvxdcLkAyR
— Rishabh Singh Parmar (@irishabhparmar) April 3, 2024
లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‌వీర్ సింగ్, ప్రేరా మాన్కా. యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, అర్షిన్ కులకర్ణి, M. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..