AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: సూపర్ మ్యాన్ సూట్‌లో ఇషాన్ కిషన్.. ఎయిర్ పోర్టులో హల్‌చల్.. కారణమేంటో తెలుసా? వీడియో

ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్, ఇషాన్ కిషన్ విచిత్రమైన అవతార్‌లో దర్శనమిచ్చాడు. సూపర్‌మ్యాన్‌ సూట్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇషాన్ కిషన్ ఇదే డ్రెస్ ధరించి విమానాశ్రయానికి కూడా వెళ్లాడు. అక్కడ అతని డ్రెస్ కోడ్ చూసి అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు. అయితే దీని వెనుక కారణం వింటే నవ్వు రాక మానదు.

IPL 2024: సూపర్ మ్యాన్ సూట్‌లో ఇషాన్ కిషన్.. ఎయిర్ పోర్టులో హల్‌చల్.. కారణమేంటో తెలుసా? వీడియో
Ishan Kishan
Basha Shek
|

Updated on: Apr 03, 2024 | 4:50 PM

Share

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన నిరాశపరిచింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో, ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్, ఇషాన్ కిషన్ విచిత్రమైన అవతార్‌లో దర్శనమిచ్చాడు. సూపర్‌మ్యాన్‌ సూట్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇషాన్ కిషన్ ఇదే డ్రెస్ ధరించి విమానాశ్రయానికి కూడా వెళ్లాడు. అక్కడ అతని డ్రెస్ కోడ్ చూసి అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు. అయితే దీని వెనుక కారణం వింటే నవ్వు రాక మానదు. ఇషాన్ కిషన్‌కి ఇలాంటి డ్రెస్ కోడ్ ఇవ్వడానికి గల కారణాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చేవారి కోసం ముంబై ఇండియన్స్ ఇలాంటి పనిష్మెంట్ ఇస్తోందట. అందుకే ఇషాన్ కిషన్ కు సూపర్ మ్యాన్ సూట్ ఇచ్చారట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో తెలియజేసింది.

ఇషాన్ కిషన్ మాత్రమే కాదు, జట్టులోని మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా ఇదే రకమైన శిక్ష పడింది. స్పిన్నర్లు కుమార్ కార్తికేయ, షామ్స్ ములానీ, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారాలకు కూడా ఇదే డ్రెస్ కోడ్ విధించింది ముంబై ఫ్రాంచైజీ. నలుగురూ సూపర్ మ్యాన్ వేషం వేసుకుని హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. కాగా, ఇషాన్ కిషన్ గత మూడు మ్యాచ్‌ల్లో ఫామ్‌లో లేడు. మూడు మ్యాచ్‌ల్లో 50 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. మరోవైపు, నేహాల్ వదేరా కూడా బ్యాటింగ్ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. కాబట్టి అతనికి ప్యాడ్స్ కట్టుకుని విమానాశ్రయం చుట్టూ తిరిగే శిక్ష విధించారు.

ఇవి కూడా చదవండి

సూపర్ మ్యాన్ డ్రెస్ లో ఇషాన్ కిషన్.. వీడియో..

ముంబై ఇండియన్స్ జట్టు:

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, షమ్స్ ములానీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, క్యూనా మఫాకా, మహ్మద్ నబీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ గోపాల్, ల్యూక్ వుడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, శివాలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, డెవాల్డ్ బ్రూయిస్.

ఎయిర్ పోర్టులో ప్యాడ్లతో నేహాల్ వధేరా.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..