Royal Challengers Bengaluru: బెంగళూరు ఖాతాలో మరో దరిద్రమైన రికార్డ్.. మరోసారి ట్రోఫీకి దూరంగానే?

IPL 2024: ఐపీఎల్ 2024 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఈజీగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి శుభారంభం లభించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించినా ఆ తర్వాత కేవలం 3 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. ఇక్కడి నుంచి మ్యాచ్ లక్నోకు అనుకూలంగా మారడంతో RCB మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Royal Challengers Bengaluru: బెంగళూరు ఖాతాలో మరో దరిద్రమైన రికార్డ్.. మరోసారి ట్రోఫీకి దూరంగానే?
Rcb
Follow us

|

Updated on: Apr 03, 2024 | 3:08 PM

Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2024 (IPL 2024)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ప్రదర్శన అంత బాగా లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తన సొంత మైదానంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఆలౌట్ అయింది. దీంతో ఆర్సీబీ పేరిట ఓ చెత్త రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఆలౌట్ అయిన జట్టుగా ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ 2024 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఈజీగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి శుభారంభం లభించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించినా ఆ తర్వాత కేవలం 3 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. ఇక్కడి నుంచి మ్యాచ్ లక్నోకు అనుకూలంగా మారడంతో RCB మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 24వ సారి ఆలౌట్..

ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఆలౌట్ అయిన జట్ల గురించి మాట్లాడితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 24 సార్లు ఆలౌట్ అయింది. ఈ విషయంలో రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు అత్యధికంగా 25 సార్లు ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ (23) మూడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ (22) నాలుగో స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (20) ఐదో స్థానంలో నిలిచారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇప్పటి వరకు 19 సార్లు ఆలౌట్ అయింది.

ఇవి కూడా చదవండి

స్వ్కాడ్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, అనుజ్ రావత్(కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ , రీస్ టోప్లీ, టామ్ కుర్రాన్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, మహిపాల్ లోమ్రోర్, విల్ జాక్స్, సుయాష్ ప్రభుదేసాయి, మనోజ్ భాండాగే, ఆకాష్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు