IPL 2024: ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..

అమ్మాయిల స్ఫూర్తితో ఈసారైనా ఛాంపియన్ గా నిలుద్దామని ఐపీఎల్ 2024 సీజన్ ‌లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో RCB కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

IPL 2024: ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
Royal Challengers Bengaluru
Follow us

|

Updated on: Apr 16, 2024 | 7:33 PM

అమ్మాయిల స్ఫూర్తితో ఈసారైనా ఛాంపియన్ గా నిలుద్దామని ఐపీఎల్ 2024 సీజన్ ‌లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో RCB కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. CSKపై ఓటమితో ఐపీఎల్ 2024 పోరును ప్రారంభించిన ఆర్సీబీ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి RCB జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ద్వితీయార్థానికి సిద్ధమవుతున్న ఆర్సీబీ.. బలమైన ప్రత్యర్థులతో పోటీపడాల్సి ఉంది. దీని ప్రకారం, RCB జట్టు తదుపరి మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది…

  • KKR vs RCB: ఏప్రిల్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
  • SRH vs RCB: ఏప్రిల్ 25న RCB, SRH జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. GT vs RCB: ఏప్రిల్ 28న జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.
  • RCB vs GT: మే 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో RCB తలపడనుంది.
  • PBKS vs RCB: మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది.
  • RCB vs DC: మే 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో RCB, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
  • RCB vs CSK: మే 18న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..