AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా? అసలు నమ్మలేకపోతున్నాం

దరాబాద్ వరుస విజయాలు సాధిస్తుండడంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ తమ ఆటగాళ్లలో జోష్ నింపుతున్నారు. మ్యాచ్‌ లో కావ్య ఉందంటే కెమెరా కళ్లన్నీ ఆమె వైపే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా క్రేజ్ తెచ్చుకున్న కావ్యా పాపతో ఈ మధ్యన ఓ బ్యూటీ కూడా కెమెరాల కంట పడింది.

IPL 2024: కావ్యా పాపతో ఉన్న ఈ క్యూటీ ఆ స్టార్ క్రికెటర్ చెల్లినా? అసలు నమ్మలేకపోతున్నాం
Kavya Maran
Basha Shek
|

Updated on: Apr 16, 2024 | 6:04 PM

Share

ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి దూకుడు మీద ఉంది. ఇప్పటి దాకా ఆడిన 6 మ్యాచుల్లో నాలుగింటిలో విజయం సాధించింది. మొత్తం 8 పాయింట్లతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గతంలో బౌలింగ్ బలంతోనే నెగ్గుకొచ్చిన ఎస్ఆర్‌హెచ్ ఈసారి తన బ్యాటింగ్ పవర్ ను కూడా చూపిస్తోంది. ఓపెనర్లు హెడ్, అభిషేక్​ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మర్కరమ్, అబ్దుల్ సమద్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ధనా ధాన్ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తుండడంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరవుతూ తమ ఆటగాళ్లలో జోష్ నింపుతున్నారు. మ్యాచ్‌ లో కావ్య ఉందంటే కెమెరా కళ్లన్నీ ఆమె వైపే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా క్రేజ్ తెచ్చుకున్న కావ్యా పాపతో ఈ మధ్యన ఓ బ్యూటీ కూడా కెమెరాల కంట పడింది. వీరిద్దరూ కలిసున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అందంలో కావ్యా పాపనే డామినేట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరు? అని తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్ తల్లిని ఆశ్రయించారు. ఇంతకీ కావ్యతో ఉన్న ఈ క్యూటీ ఎవరో తెలుసా? ఎస్ ఆర్ హెచ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి. ఈమె పేరు కోమల్ శర్మ.

ఈసారి ఐపీఎల్​లో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడుతూ హైదరాబాద్ విజయాల్లో​ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో అభిషేక్ స్ట్రయిక్ రేట్ 208 కు పైగా ఉండడం అతని విధ్వంసం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్‌లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతోంది అభిషేక్ సోదరి కోమల్ శర్మ.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కావ్య మారన్ ​తో కలసి ఫొటోలు కూడా దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అభిషేక్ సోదరి అని తెలియడంతో క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కోమల్ ది హీరోయిన్లకు తగ్గని అందం అంటూ మెచ్చుకుంటున్నారు.

తల్లి, సోదరితో అభిషేక్ శర్మ..

క్లాసెస్ కూతురితో కోమల్ శర్మ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో