IPL 2024: రెండు మ్యాచుల్లోనూ ధోని బ్యాటింగ్‌కు రాకపోవడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన కోచ్

మొదట RCBని ఓడించిన చెన్నై ఆపై గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. రెండు మ్యాచుల్లోనూ చెన్నై బ్యాటర్లు అదరగొట్టారు.టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ మెరుగైన స్కోర్లు చేశారు. అయితే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు రాకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది

IPL 2024: రెండు మ్యాచుల్లోనూ ధోని బ్యాటింగ్‌కు రాకపోవడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన కోచ్
MS Dhoni
Follow us

|

Updated on: Mar 27, 2024 | 8:04 PM

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొదట RCBని ఓడించిన చెన్నై ఆపై గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. రెండు మ్యాచుల్లోనూ చెన్నై బ్యాటర్లు అదరగొట్టారు.టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ మెరుగైన స్కోర్లు చేశారు. అయితే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌కు రాకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. తాజాగా ఇదే విషయంపై చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఎం ఎస్ ధోని బ్యాటింగ్ కు రాలేకపోతున్నడని హస్సీ తెలిపాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల బ్యాటింగ్ ఆర్డర్ లెంగ్త్ ఎక్కువైంది. అందుకే ధోని 8వ స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సి వస్తోంది. మరోవైపు వేగంగా పరుగులు చేయాలని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బ్యాటర్లకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అందుకే ధోని బ్యాటింగ్‌కు రావడం లేదు. ధోనీ 8వ స్థానంలో ఉండటం వల్ల అతని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తుఫాను బ్యాటింగ్ చేయగలరు. వేగంగా ఆడుతూ టాప్ ఆర్డర్ తొందరగానే ఔటైనా.. విమర్శలకు గురికాకూడదని జట్టు నిర్ణయించింది. ఎందుకంటే ఇది జట్టు వ్యూహం. అయితే మిస్టర్ కూల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నెట్స్ లో భారీ షాట్లు ఆడుతున్నాడు’ అని హస్సీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్‌ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయింది. అయినా ధోని క్రీజులోకి అడుగు పెట్టలేదు. CSK మేనేజ్‌మెంట్ సమీర్ రిజ్వీని బ్యాటింగ్‌కి పంపింది, అతను వచ్చిన వెంటనే 2 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే రాబోయే మ్యాచ్‌ల్లో ధోనీ తన బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా చెన్నై తన తర్వాతి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం (మార్చి 31) ఈ మ్యాచ్ జరగనుంది.

ధోని హైలెట్ క్యాచ్.. వీడియో ఇదిగో..

విండీస్ దిగ్గజం బ్రేవతో మహేంద్ర సింగ్ ధోని..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..