- Telugu News Photo Gallery Cricket photos Heinrich Klaasen Is the X Factor For Sunrisers Hyderabad In IPL 2024, Details Here
SRH: ఆ ప్లేయర్ సన్‌రైజర్స్‌కు బ్రహ్మాస్త్రం.. బరిలోకి దిగాడంటే ప్రత్యర్ధులకు ఊహకందని ఊచకోత!
ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ఆరంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల అత్యల్ప తేడాతో ఓడిపోయింది సన్‌రైజర్స్. అయితేనేం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఈ సీజన్‌లో ప్రత్యర్ధులపై ఉపయోగించేందుకు హైదరాబాద్ జట్టు ఓ బ్రహ్మాస్త్రం దొరికేసింది.
Updated on: Mar 27, 2024 | 8:12 PM

ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ఆరంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల అత్యల్ప తేడాతో ఓడిపోయింది సన్‌రైజర్స్. అయితేనేం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఈ సీజన్‌లో ప్రత్యర్ధులపై ఉపయోగించేందుకు హైదరాబాద్ జట్టు ఓ బ్రహ్మాస్త్రం దొరికేసింది. ఆ ప్లేయర్‌ను సరిగ్గా వాడితే.. ఊహకందని ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో తెలుసా.?

అతడే హెన్రిచ్ క్లాసెన్. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఔటయ్యాడు క్లాసెన్. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.

చేజ్ ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. క్లాసెన్ క్రీజులో ఉన్నంతసేపు ఎస్‌ఆర్‌హెచ్‌కి విజయం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్లాసెన్‌ను.. అప్పుడప్పుడూ ఆర్డర్‌లో ముందుకు పంపాలని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.

వన్‌డౌన్ లేదా టూడౌన్.. మిడిలార్డర్‌లో క్లాసెన్ బ్యాటింగ్‌కు దిగితే.. జట్టుకు భారీ స్కోర్ రావడం ఖాయం అని అంటున్నారు. క్లాసెన్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉందని.. అలాగే స్పిన్ బౌలింగ్ ఆడటంలో సమర్ధుడు అని చెబుతున్నారు.

గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా.. క్లాసెన్ మాత్రం ఫినిషర్‌గా వచ్చి.. చాలా మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అందుకే ఈసారైనా హైదరాబాద్ యాజమాన్యం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని క్లాసెన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాలని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కోరుతున్నారు.




