SRH vs MI, Playing XI, IPL 2024: హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. 17 ఏళ్ల ప్లేయర్ ఎంట్రీ
Sunrisers Hyderabad Vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హోరాహోరీ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్ లో హైదరాబాద్, ముంబై రెండూ జట్లు ఇంకా బోణీ కొట్టలేదు
Sunrisers Hyderabad Vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హోరాహోరీ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్ లో హైదరాబాద్, ముంబై రెండూ జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కేకేఆర్ విజయం సాధించింది. ఈరోజు రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి విజయం ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 21 మ్యాచ్‌లు జరగ్గా అందులో ముంబై 12 మ్యాచ్‌లు, హైదరాబాద్ 9 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే హోమ్ గ్రౌండ్‌లో సన్ రైజర్స్ కు మంచి రికార్డే ఉంది. మరి ముంబై ఆ రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అన్నది చూడాలి. కాగా రోహిత్ శర్మ ఈరోజు ముంబై ఇండియన్స్ తరఫున 200వ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ 129.9 స్ట్రైక్ రేట్‌తో 5084 పరుగులు చేశాడు. ఇందులో 34 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. రోహిత్ తన నాయకత్వంలో ముంబైకి ఐదు ట్రోఫీలు గెలుచుకున్నాడు.
కాగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ -XI
Your first home 1️⃣1️⃣ of the season is HERE, #OrangeArmy!
We bat first at Uppal 👊🔥#PlayWithFire #SRHvMI @Dream11 pic.twitter.com/C8FVUYPaWL
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ ( వికెట్ కీపర్ ), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే
First time in 🟠 for Travis & Unadkat 🙌
Go well, boys 🧡 pic.twitter.com/8YOry2DYAi
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024
ఇంపాక్ట్ ప్లేయర్: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ -XI
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.
ఇంపాక్ట్ ప్లేయర్: డెవాల్డ్ బ్రూయిస్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, విష్ణు వినోద్, నెహాల్ వధేరా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..