IPL 2024, GT vs CSK: మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఓడితే ప్లేఆఫ్స్ నుంచి గుజరాత్ ఔట్..

Gujarat Titans vs Chennai Super Kings, 59th Match Preview: IPL 2024లో, శుక్రవారం, మే 10న, ఈ సీజన్‌లోని 59వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ప్లేఆఫ్‌ కోణంలో చూస్తే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి అంటే పదో స్థానంలో ఉంది.

IPL 2024, GT vs CSK: మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఓడితే ప్లేఆఫ్స్ నుంచి గుజరాత్ ఔట్..
Gt Vs Csk Preview
Follow us

|

Updated on: May 10, 2024 | 9:10 AM

Gujarat Titans vs Chennai Super Kings, 59th Match Preview: IPL 2024లో, శుక్రవారం, మే 10న, ఈ సీజన్‌లోని 59వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ప్లేఆఫ్‌ కోణంలో చూస్తే ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి అంటే పదో స్థానంలో ఉంది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 4లో భాగంగా ఉంది.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోగా, ఆ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్‌కేపై ఓటమి ఎదురైతే ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న కల చెదిరిపోతుంది. గుజరాత్ బ్యాట్స్‌మెన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఓపెనింగ్ జోడి ఇప్పటివరకు చాలా నిరాశపరిచింది. కెప్టెన్ గిల్ కూడా ఓపెనర్‌గా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేక పోవడంతో ఆ జట్టు తీవ్ర భారాన్ని మోయాల్సి వచ్చింది. అదే సమయంలో, బౌలింగ్‌లో కూడా మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు.

మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ప్రదర్శన అంతగా లేకపోయినప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తన క్లెయిమ్‌ను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాడు. బౌలింగ్‌లో, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చాడు. మతిషా పతిరానా కూడా గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో డెత్ బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, జోష్ లిటిల్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, రిచర్డ్ గ్లీసన్.

పిచ్, వాతావరణం..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం పిచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో హోరాహోరీ కనిపిస్తోంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 5 మ్యాచ్‌ల్లో గుజరాత్ రెండింట్లో గెలుపొందగా, ఆతిథ్య జట్టు పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీలపై ఓటమి చవిచూసింది. వాతావరణం గురించి చెప్పాలంటే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 32 నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు.

మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం..

మ్యాచ్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక డిజిటల్‌లో జియో సినిమా యాప్. వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

IPL 2024 59వ మ్యాచ్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు..

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభినవ్ సదారంగని, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాంతియా, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, స్పెన్సర్ జాన్సన్, షారుక్ ఖాన్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, అజ్మతుల్లా ఒమర్జాయ్, మానవ్ సుతార్, సందీప్ వారియర్, BR శరత్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే, మహిష్ తిఖ్‌స్నా, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, ముఖేష్ చౌదరి, ముకేష్ చౌదరి , నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, అజయ్ మొండల్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, అవ్నీష్ రావ్ ఆరావళి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం
హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ దుర్మరణం
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..