Venkata Chari |
Updated on: May 10, 2024 | 8:31 AM
ఐపీఎల్ 2024లో 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి ఆర్‌సీబీకి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ధర్మశాలలో వడగళ్ల వాన తర్వాత విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, కేవలం 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు.
నిజానికి ఈ మ్యాచ్‌లో కోహ్లీకి సరిగ్గా 2 లైఫ్‌లు దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోహ్లి సున్నాకి ఔటయ్యాడు. కానీ, అశుతోష్ క్యాచ్ మిస్సయ్యాడు. ఆ తర్వాత కూడా కోహ్లి 10 పరుగులు చేయగానే మరో క్యాచ్ పట్టి రూసో రెండో లైఫ్ ఇచ్చాడు.
ఇలా ఈ మ్యాచ్‌లో రెండు లైఫ్‌లను సద్వినియోగం చేసుకున్న కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేశాడు. అతను అత్యధిక ప్రత్యర్థి జట్లపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
పంజాబ్ కింగ్స్‌తో పాటు, విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1000+ పరుగులు చేశాడు. కోహ్లీ ఢిల్లీపై 1030 పరుగులు, పంజాబ్‌పై 1020 పరుగులు, CSKపై 1006 పరుగులు చేశాడు.
అతనితో పాటు, రోహిత్ శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ వార్నర్ (కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) 2 ప్రత్యర్థి జట్లపై తలా 1000 కంటే ఎక్కువ పరుగులు చేశారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లి మొత్తం 634 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2013, 2016, 2023లో విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు చేశాడు. అతనితో పాటు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ 3 సీజన్లలో 600+ పరుగులు సాధించగా, ఫాఫ్ డు ప్లెసిస్ 2 సీజన్లలో 600+ పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లి 388 మ్యాచ్‌ల్లో 371 ఇన్నింగ్స్‌ల్లో 401 సిక్సర్లు కొట్టాడు.