LSG vs RR, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే

Lucknow Super Giants vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ సీజన్ 2024లో భాగంగా 44 వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌ పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

LSG vs RR, IPL 2024: లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే
Lucknow Super Giants vs Rajasthan Royals
Follow us

|

Updated on: Apr 29, 2024 | 7:46 PM

Lucknow Super Giants vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ సీజన్ 2024లో భాగంగా 44 వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌ పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు లక్నో పడుతూ లేస్తోంది. కే ఎల్ రాహుల్ సారథ్యంలోని ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. లక్నో కూడా తమ విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి లక్నో మొదట బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రియాన్ పరాగ్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, టామ్ కోహ్లర్-కాడ్మోర్, తనుష్ కోటియన్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అమిత్ మిశ్రా, అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్ చరక్, మణిమారన్ సిద్ధార్థ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..