AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌ను తెగ ట్రోల్ చేస్తోన్న CSK ఫ్యాన్స్.. కారణమిదే

కొత్త కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ సారథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగింది CSK. ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్ లు ఆడగా, నాలుగింటిలో ఓడి మరో నాలుగింటిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ధోనీ టీమ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ పరాజయం పాలైంది.

IPL 2024: టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌ను తెగ ట్రోల్ చేస్తోన్న CSK ఫ్యాన్స్.. కారణమిదే
Chennai Super Kings
Basha Shek
|

Updated on: Apr 24, 2024 | 6:44 PM

Share

IPL 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఒడిదొడుకులతో సాగుతోంది. కొత్త కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ సారథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగింది CSK. ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్ లు ఆడగా, నాలుగింటిలో ఓడి మరో నాలుగింటిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ధోనీ టీమ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ పరాజయం పాలైంది. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జట్టు 4 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. లక్నో విజయంలో మార్కస్ స్టోయినిస్ కీలక పాత్ర పోషించాడు. అతను అద్భుత సెంచరీతో తన టీమ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అయితే చెన్నై అభిమానులు మాత్రం ఈ పరాజయానికి దీపక్ చాహర్ కారణమంటున్నారు. అతనిని లక్ష్యంగా చేసుకుని నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్‌కే ఓటమికి చాలా కారణాలున్నాయి. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం దీపక్ చాహర్ విలన్ గా మారిపోయాడు. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ బాగానే బౌలింగ్ వేశాడు. తొలి ఓవర్లోనే క్వింటన్ డి కాక్ ను డకౌట్ చేశాడు. అంతేకాదు పవర్‌ప్లే తొలి 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి బౌలింగ్‌ రాలేదు. అయితే దీపక్ చాహర్ ఫీల్డింగ్ తప్పిదాలు జట్టును తీవ్రంగా నష్టపరిచాయి. చివరి 5 ఓవర్లలో చాహర్ 3 సార్లు మిస్ ఫీల్డింగ్ చేశాడు. దీనికి చెన్నై జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఫీల్డింగ్ తప్పిదాలతో..

మొదట 16వ ఓవర్ రెండో బంతికి చాహర్ బంతిని అడ్డుకునే సులువైన అవకాశాన్నివిడిచిపెట్టాడు. దీంతో ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయింది. ఇక 18వ ఓవర్ చివరి బంతికి చాహర్ అతి పెద్ద తప్పు చేశాడు. మార్క్ స్టోయినిస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద చాహర్ క్యాచ్ పట్టలేకపోయాడు. దీంతో బంతి సిక్సర్‌ గా వెళ్లింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే చాహర్ ఫీల్డింగ్ లో తప్పిదం చేయడంతో బంతి మళ్లీ బౌండరీ దాటింది. చివరకు మార్క్ స్టోయినిస్ లక్నోకు విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

14 కోట్లకు కొంటే..

సోషల్ మీడియా చెన్నై అభిమానులు ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. చాహర్ గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఎక్స్’ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ వరకు చాహర్‌పై దుర్భాషలాడుతున్నారు. దీపక్ చాహర్ గత ఏడు సీజన్‌లుగా జట్టులో భాగమయ్యాడు. 2022 మెగా వేలంలో CSK అతని కోసం 14 కోట్లకు బిడ్ చేసింది. ఇప్పుడు అతడిని జట్టు నుంచి తొలగించాలని చెన్నై అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై 8 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయింది. లక్నో చేతిలో చెన్నై ఓటమి జట్టుకు, అభిమానులకు తీరని లోటు. CSK స్వదేశంలో ఎప్పుడూ అద్భుతంగా ఆడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్‌కే ఐదో స్థానంలో కొనసాగుతోంది. వారు ఇప్పటికీ ప్లే ఆఫ్ రేసులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..