IPL 2024: ‘రోహిత్‌ను తప్పించి తప్పు చేశారు’.. ముంబై కెప్టెన్సీని హార్దిక్‌కు ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. సారథిగా తన అరంగేట్రం సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ తర్వాత కూడా 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇక బ్యాటర్ గా ఏకంగా 5,314 పరుగులు చేసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు

IPL 2024: 'రోహిత్‌ను తప్పించి తప్పు చేశారు'.. ముంబై కెప్టెన్సీని హార్దిక్‌కు ఇవ్వడంపై టీమిండియా మాజీ క్రికెటర్
Hardik Pandya, Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2024 | 10:46 AM

ముంబయి ఇండియన్స్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. 2011 నుంచి ముంబై తరఫున ఆడడం ప్రారంభించాడు హిట్ మ్యాన్‌. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. సారథిగా తన అరంగేట్రం సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ తర్వాత కూడా 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఇక బ్యాటర్ గా ఏకంగా 5,314 పరుగులు చేసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రోహిత్‌. వరుసగా 11 సీజన్ల పాటు ముంబై జట్టును ముందుండి నడిపించిన హిట్ మ్యాన్ హార్దిక్ పాండ్యా రాకతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. హార్దిక్ పాండ్యా రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. అయితే విండో ట్రేడింగ్ లో భాగంగా IPL 2024 కంటే ముందే గుజరాత్ కు గుడ్ బై చెప్పేసి ముంబైకి తిరిగి వచ్చాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియాన్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ముంబై కెప్టెన్సీ మార్పుపై స్పందించాడు. రోహిత్‌కు బదులుగా పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసి ఫ్రాంచైజీ తప్పుడు నిర్ణయం తీసుకుందని అంబటి అభిప్రాయపడ్డాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ మరో ఏడాది పాటు ముంబైకు కెప్టెన్సీని కొనసాగించాల్సి ఉందన్నాడు.

‘రోహిత్ శర్మను మరో ఏడాది పాటు ముంబై కెప్టెన్‌గా కొనసాగించాల్సి ఉంది. హార్దిక్ ఒక సంవత్సరం పాటు ఆడి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని చేపట్టే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఇప్పటికీ భారత టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ సెటప్ నుండి వచ్చిన హార్దిక్‌కి ఇది చాలా కష్టమైన సమయం. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండటం కష్టం. ఇది అతనిపై మరింత ఒత్తిడి పెంచుతుంది. స్టార్ ప్లేయర్లందరినీ కలిసి హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు’ అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. రాయుడు 2010-2017 మధ్య ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. గత సీజన్‌తో సహా మొత్తం మూడు ఐపీఎల్ టైటిల్స్‌లో రాయుడు భాగమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ లేటెస్ట్ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!