IPL 2023: ‘రోహిత్ శర్మ రెస్ట్ తీసుకో, లేకపోతే కష్టమే’.. హిట్‌మ్యాన్‌పై టీమిండియా మాజీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..?

ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ 2022 తరహాలోనే ఐపీఎల్ 16వ సీజన్‌ కూడా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. ముంబై జట్టును 5 సార్లు టోర్నీ చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ ఈ టోర్నీలో..

IPL 2023: ‘రోహిత్ శర్మ  రెస్ట్ తీసుకో, లేకపోతే కష్టమే’.. హిట్‌మ్యాన్‌పై టీమిండియా మాజీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..?
Sunil Gavaskar's Advice For Rohit Sharma
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 26, 2023 | 1:08 PM

ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ 2022 తరహాలోనే ఐపీఎల్ 16వ సీజన్‌ కూడా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. ముంబై జట్టును 5 సార్లు టోర్నీ చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ ఈ టోర్నీలో అసలు రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 181 పరుగులను మాత్రమే చేశాడు. రోహిత్ ఇలా ఆడడం కేవలం తన టీమ్‌నే కాక అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ 2  పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.

అయితే రోహిత్ శర్మ ఐపీఎల్ టోర్నో ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియాను నడిపించాల్సి ఉంది. కానీ రోహిత్ ఇలా వరుసగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఐపీఎల్ నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఇంకా గుజరాత్ టైటాన్స్‌పై అతను ఔట్ అయిన తీరు తనను ఆందోళనకు గురి చేసిందని, ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి రోహిత్ బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించిందని పేర్కొన్నాడు. మళ్లీ ఈ సీజన్ చివర్లో అతను ఎంట్రీ ఇచ్చినా పర్లేదని, విశ్రాంతి మాత్రం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ తర్వాత జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అతను సిద్ధంగా ఉండాలని, అతని వైఫల్యం ప్రభావం ఆ మ్యాచ్‌పై పడకూడదని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇంకా రోహిత్ సారథ్యంలోని టీమ్‌పై కూడా అది ప్రభావం చూపుతుందని వివరించాడు.

కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌(జూన్ 7 నుంచి జూన్ 11)ను ఆడనుంది. ఆ వెంటనే సెప్టెంబర్‌లో ఆసియా కప్, అనంతరం అక్టోబర్న-నవంబర్ మధ్యకాలంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలు ఆడాల్సి ఉంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాను రోహిత్ నడిపిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో కూడా రోహిత్ శర్మనే టీమిండియాను నడిపించనున్నాడు. అందుకే రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..