IPL 2023: పాపం కోహ్లీ! అక్కడ హిట్.. ఇక్కడ ఫ్లాప్.. మరో తప్పు జరిగితే బ్యాన్ పడ్డట్టే..
ఐపీఎల్‌లో కెప్టెన్‌కి సంబంధించి ఒక రూల్ ఉంది. దాన్ని రెండుసార్లు బ్రేక్ చేస్తే.. జరిమానా పడుతుంది. కానీ, అదే తప్పు మూడోసారి రిపీట్ అయితే..
ఐపీఎల్‌లో కెప్టెన్‌కి సంబంధించి ఒక రూల్ ఉంది. దాన్ని రెండుసార్లు బ్రేక్ చేస్తే.. జరిమానా పడుతుంది. కానీ, అదే తప్పు మూడోసారి రిపీట్ అయితే.. అప్పుడు ఫైన్ ఒకటే కాదు.. ఏకంగా కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం కూడా పడుతుంది. ఆ రూల్ మరెంటో కాదు.. స్లో ఓవర్ రేట్. ఈ హీట్ ఇప్పుడు విరాట్ కోహ్లిపై పడింది. కెప్టెన్‌గా హిట్ అయిన విరాట్.. ఇక్కడ మాత్రం ప్రతీసారి ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కానప్పటికీ. ఆ జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్‌లకు అతడే కెప్టెన్. ఇక, ఈ టీమ్‌కి ప్రధాన కెప్టెన్ అయిన ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కోహ్లీ కెప్టెన్సీ చేసిన చివరి 2 మ్యాచ్‌లు ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించింది. కానీ ఈ రెండింటిలోనూ స్లో ఓవర్ రేట్ కోహ్లికి తలనొప్పిగా మారింది. ఇందులో భాగంగానే మొన్న కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ ఫీజు నుంచి రూ. 24 లక్షలు కట్టాల్సి వచ్చింది. అదే సమయంలో, నిబంధనల ప్రకారం, జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడుతుంది. ఇక టోర్నీ ప్రారంభంలో స్లో ఓవర్ రేట్ ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా కట్టాడు.
మరో పొరపాటు జరిగితే భారీ మూల్యమే..
ఇప్పుడు తదుపరి మ్యాచ్‌లో కూడా RCB స్లో-ఓవర్ రేట్ విధానాన్ని మెరుగుపరచకపోతే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం. అదే సమయంలో, జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. ఒకవేళ అతడి సారధ్యంలో జట్టు గెలిచినా, ఓడినా.. స్లో ఓవర్ రేట్ పడితే మాత్రం విరాట్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సిందే.