AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV Offer: కొత్త టీవీ కొనాలనుకునేవారికి శుభవార్త.. రూ.500 లకే అదిరిపోయే టీవీ.. లిమిటెడ్ ఆఫర్, త్వరపడండి..!

TV Offer: కొత్త టీవీ కొనాలకుంటున్నారా..? అయితే మీ కోసమే అద్భుతమైన బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. 24 అంగుళాల కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ మీకు కేవలం 4,999 రూపాయలకే అభిస్తుంది. దీని సాధారణ ధర 10,999 రూపాయలు ఉండగా.. ప్రముఖ ఈకామర్స్..

TV Offer: కొత్త టీవీ కొనాలనుకునేవారికి శుభవార్త.. రూ.500 లకే అదిరిపోయే టీవీ.. లిమిటెడ్ ఆఫర్, త్వరపడండి..!
Complaq Led Tv
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 26, 2023 | 7:36 AM

Share

TV Offer: కొత్త టీవీ కొనాలకుంటున్నారా..? అయితే మీ కోసమే అద్భుతమైన బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. 24 అంగుళాల కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ మీకు కేవలం 4,999 రూపాయలకే అభిస్తుంది. దీని సాధారణ ధర 10,999 రూపాయలు ఉండగా.. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంటే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ ద్వారా ఏకంగా 54 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ టీవీ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ స్మార్ట్ టీవీ కాదని కూడా మీరు గమనించాలి. ఇంకా ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటేనే స్మార్ట్ టీవీ ఉత్తమం. లేదంటే సాధారణ ఎల్ఈడీ టీవీ కొనుక్కోవడమే చాలా ఉత్తమం.

ఇక ఈ ఎల్ఈడీ టీవీలో 16 వాట్స్ సౌండ్ ఔట్‌పుట్, రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్టీ‌తో పాటు టీవీ కొనుగోలు చేసిన పది రోజుల తర్వాత వరకు కూడా రిప్లేస్‌మెంట్ పాలసీ ఉంటుంది. అంటే మీకు ఈ ఎల్ఈడీ టీవీ నచ్చకపోతే వెంటనే వెనక్కి ఇచ్చేయొచ్చు. కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీలోని పూర్తి ఫీచర్ల గురించి మాట్లాడుకోవాలంటే.. ఇందులో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఫీచర్ ఉన్నాయి. పైగా ఈ టీవీపై సంవత్సర కాలం వరకు వారంటీ లభిస్తుంది. కాబట్టి టీవీ విషయంలో అభ్యంతరం, ఇబ్బంది అవసరంలేదు.

అలాగే ఈ ఎల్ఈడీ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కేవలం రూ. 241 నెలవారీ ఈఎంఐతో 24 నెలల పాటు చెల్లించుకోవవచ్చు. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 310, సంవత్సరం పాటు ఈఎంఐ కట్టాలకుంటే నెలకు రూ. 449 చెల్లించాలి. ఇవేమి కాకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలనుకుంటే 9 నెలలకు రూ. 589 ఈఎంఐ, 6 నెలలకు రూ. 868 ఈఎంఐ చెల్లించవలసి ఉంటుంది. కస్టమర్ల కోసం ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీ ఇచ్చి ఈ టీవీని కొంటే మీకు రూ. 4464 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు దాదాపు రూ. 500 పెట్టుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో అదిరే టీవీ మీ  సొంతం.

ఇవి కూడా చదవండి