Arjun Tendulkar: జూ.టెండూల్కర్‌పై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లెజెండరీ బౌలర్.. ‘కీబోర్డు యోధులే’ అంటూ..

IPL 2023, GT vs MI: ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెటర్‌నే తన కెరీర్‌గా ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున బౌలర్‌గా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్..

Arjun Tendulkar: జూ.టెండూల్కర్‌పై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లెజెండరీ బౌలర్.. ‘కీబోర్డు యోధులే’ అంటూ..
Brett Lee Backs Arjun Tendulkar And Advices
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 26, 2023 | 12:19 PM

IPL 2023, GT vs MI: ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున బౌలర్‌గా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ ఆడిన రెండో మ్యాచ్‌లోనే పంజాబ్ బ్యాటర్ల చేతిలో చిక్కుకుపోయాడు. ఒక ఓవర్‌లోనే 31 పరుగులతో ఇచ్చుకుని నెటిజన్ల ట్రోల్స్‌కి లక్ష్యంగా మారాడు.  మారాడు. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అయినా అర్జున్‌పై ఆగకుండా ట్రోల్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియన్ లెజెండరీ పేసర్ బ్రెట్‌లీ అతనికి మద్ధతుగా నిలిచాడు. అంతేకాక తనదైన శైలిలో సలహాలను కూడా ఇచ్చాడు.

అర్జున్‌ టెండూల్కర్‌పై బ్రెట్‌లీ మాట్లాడుతూ ‘మైదానం బయట కూర్చునేవారు ఎప్పుడూ కూడా విమర్శలు చేస్తూనే ఉంటారు. సీనియర్‌ బౌలర్‌ సందీప్ శర్మ 120 కి.మీ వేగంతో బంతులు వేస్తుంటే.. అర్జున్‌ అంతకంటే ఎక్కువ వేగంతో విసరగలుగుతున్నాడు. పైగా అతడికి ఇంకా 23 సంవత్సరాలు మాత్రమే. అర్జున్‌కు ఇంకా చాలా కెరీర్‌ ఉంది. ఈ నేపథ్యంలో అర్జున్‌కి నేనిచ్చే ఒకే ఒక్క సలహా.. ఇలాంటి విమర్శలను ఎప్పుడూ పట్టించుకోవద్దు. నిలకడగా 140 కి.మీ వేగంతో బంతులు వేస్తున్న అర్జున్‌ తప్పకుండా ముంబై జట్టుకు బలంగా మారగలడు. అర్జున్ బౌలింగ్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ముంబై తరఫున అతను మంచి ఫామ్‌లో ఉండడంతో పాటు అందరికంటే బంతిని ఎక్కువగా స్వింగ్ చేయగలుగుతున్నాడు. ఇక అతనిపై విమర్శలు చేసేవారంతా తమ జీవితంలో ఒక్కబంతిని కూడా అతనిలా వేసి ఉండరు. వాళ్లంతా కీబోర్డు వారియర్లు మాత్రమే’ అని పేర్కొన్నాడు.

కాగా,  అర్జున్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను 3 వికెట్లు తీయడంతో పాటు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ సిక్సర్‌తో సహా 13 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..