AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి బూట్లు అమ్మి క్రికెటర్‌ని చేశాడు.. ఇప్పుడు ఈ 2.60 కోట్ల ప్లేయర్ రోహిత్ టీంని గజగజ వణికించాడు..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తమ సొంత మైదానంలో మంగళవారం ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2023లో గుజరాత్‌కు ఇది ఐదో విజయం..

తండ్రి బూట్లు అమ్మి క్రికెటర్‌ని చేశాడు.. ఇప్పుడు ఈ 2.60 కోట్ల ప్లేయర్ రోహిత్ టీంని గజగజ వణికించాడు..
Abhinav Manohar
Ravi Kiran
|

Updated on: Apr 26, 2023 | 11:32 AM

Share

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తమ సొంత మైదానంలో మంగళవారం ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2023లో గుజరాత్‌కు ఇది ఐదో విజయం. దీనిలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు అభినవ్ మనోహర్. తన తుఫాను ఇన్నింగ్స్‌తో అందరినీ అలరించిన అతడు.. ఒకవేళ ముందుగానే అవుట్ అయ్యి ఉంటే.. కచ్చితంగా హార్దిక్ పాండ్యా జట్టు ఓటమిపాలయ్యేది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. 21 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన అభినవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

13వ ఓవర్లో అభినవ్ మనోహర్ బ్యాటింగ్‌కు దిగాడు. 13, 14 ఓవర్లలో కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడి రెండు పరుగులు చేశాడు. ఎప్పుడైతే 15వ ఓవర్లో పియూష్ చావ్లా వచ్చాడో.. అప్పుడు అభినవ్ తన తుఫాన్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఆ ఓవర్‌‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఇక్కడి నుంచి గుజరాత్‌ పరుగుల వర్షం కురిపించింది. ఒకానొక సందర్భంలో మనోహర్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. కానీ అతడి ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికే ముగిసింది. అతడు రిలే మెరెడిత్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో అభినవ్ మొత్తంగా 21 బంతులు ఆడి మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. మరోవైపు అభినవ్‌ తుఫాన్ ఇన్నింగ్స్‌కు డేవిడ్ మిల్లర్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్దరూ 35 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గుజరాత్‌ భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డారు. ఈ ఇద్దరు బ్యాటర్లు డెత్ ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టారు. మిల్లర్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

అభినవ్ మ్యాచ్ విన్నర్..

గతేడాది జరిగిన వేలంలో అభినవ్‌ను 2.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం అతని బేస్ ధర కంటే 13 రెట్లు ఎక్కువ. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడుతూ.. తనలో సిక్సర్లు కొట్టే సత్తాను చాటాడు. 2021లో, అతడు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 162 పరుగులు చేశాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు.

తండ్రి బూట్లు అమ్మి క్రికెటర్‌ని చేశాడు..

అభినవ్ బెంగళూరులోని సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి బెంగళూరులో పాదరక్షల దుకాణం నడుపుతున్నాడు. క్రికెట్ కోచ్ ఇర్ఫాన్ సైత్ వద్దకు తన కొడుకు అభినవ్‌ను తీసుకెళ్ళి.. చేర్చుకోవాలని అతడి తండ్రి కోరాడు. తద్వారా అభినవ్ తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2006లో అభినవ్ అండర్-14 మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో.. అతడి తలకు గాయమైంది. ట్రీట్‌మెంట్ కోసం వెళితే కుట్లు పడ్డాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మరుసటి రోజు బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అదే అతడి కెరీర్ టర్నింగ్ పాయింట్ అని అభినవ్ క్రికెట్ కోచ్ పేర్కొన్నాడు.