IPL 2023: ఆ 4 ఓవర్లే ముంబై కొంపముంచాయి.. దడ పుట్టించేవారు.. దెబ్బకు దడుసుకున్నారు.!
ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు తమ స్థాయి ఆటను కనబరిచిన ఈ జట్టు..
ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు తమ స్థాయి ఆటను కనబరిచిన ఈ జట్టు.. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలోనే విజయం సాధించి.. నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక అంతకముందు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన రోహిత్ జట్టు.. ఈ రెండు పరాజయాలతో తమలోని బలహీనతలను బయటపెడుతోంది.
టీ20ల్లో డెత్ ఓవర్లు(16-20) చాలా కీలకం. ఈ ఓవర్లలోనే గెలుపోటముల డిసైడ్ అవుతాయి. ప్రతి జట్టు ఈ సమయంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కనీస పరుగులను వెచ్చించడానికి, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గరిష్ట పరుగులను రాబట్టడానికి చూస్తుంది. ఇక ఈ డెత్ ఓవర్లలో ముంబై బలహీనత బయటపడింది. వరుస రెండు మ్యాచ్‌లలోనూ ధారాళంగా పరుగులు సమర్పించింది. ఏప్రిల్ 22న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై చివరి నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇవ్వగా.. నిన్న గుజరాత్ మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్లకు ఏకంగా 70 పరుగులు ఇచ్చింది. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే.. అయితే ఆ 70 పరుగులతో ఈ స్కోరు కాస్తా 20 ఓవర్లలో 207గా మారింది. ఇంకేముంది ముంబై బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఫాస్ట్ బౌలింగ్ బలహీనత..
ఈ సీజన్‌కు ముంబై జట్టు డెత్ ఓవర్లకు మంచి ఫాస్ట్ బౌలర్లను కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. జోఫ్రా ఆర్చర్ ఫిట్‌నెస్ కష్టాలు ముంబైకి తలనొప్పిగా మారాయి. ఇక మిగతా బౌలర్లకు పెద్దగా అనుభవం లేదు. ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రిలే మెరెడిత్ ధీటుగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్ కూడా అంతంతమాత్రమే. కాగా, డెత్ ఓవర్లలో జట్టుకు రన్స్ ఆదా చేసే బౌలర్ల కొరత ముంబైలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి రోహిత్ సకాలంలో పరిష్కారం వెతక్కపోతే.. ప్లే-ఆఫ్స్ చేరడం కష్టమే.
Miller’s TITANic sixes ?#GTvMI #IPL2023 #JioCinema #IPLonJioCinema pic.twitter.com/BJJsmpWfGC
— JioCinema (@JioCinema) April 25, 2023