AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthcare: ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలివే.. పెడితే ఇక అంతే సంగతులు..

చాలా మంది ఇంట్లోని ఆహారాలు పాడవకుండా, మరి కొద్ది గంటలైనా నిల్వ ఉంటాయన్న ఉద్దేశ్యంతో చీటికీమాటికీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కనిపించిన ప్రతి పదార్థాలను, ఆహారాలను అందులో పెట్టడం మంచిది కాదంట. అలా చేస్తే వాటిలోని

Healthcare: ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలివే.. పెడితే ఇక అంతే సంగతులు..
Food Items That Should Not Place In Fridge
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 26, 2023 | 11:45 AM

Share

చాలా మంది ఇంట్లోని ఆహార పదార్థాలు పాడవకుండా, మరి కొద్ది గంటలైనా నిల్వ ఉంటాయన్న ఉద్దేశ్యంతో చీటికీమాటికీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కనిపించిన ప్రతి పదార్థాలను, ఆహారాలను అందులో పెట్టడం మంచిది కాదంట. అలా చేస్తే వాటిలోని ఫ్లేవర్ మారిపోవడంతోపాటు న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అంతేకాదు కొన్ని రకాల పదార్థాలు విషంగా మారి ఫుడ్ పాయిజనింగ్‌కి కూడా కారణం కాగలవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి  అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. అలా ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బంగాళాదుంపలు: బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం పెరిగిపోతుంది. ఫలితంగా అనతి కాలంలో డయాబెటీస్, కిడ్నీల ఆనారోగ్యం వంటి సమస్యలకు దారి తీయగలదు. ఇంకా అధిక చక్కెర వల్ల కూరలో టేస్ట్‌ కూడా మారుతుంది. వీటితో పాటు చల్లని ఉష్ణోగ్రత కారణంగా దుంపలకి మొలకలు వస్తాయి.

తేనె: ఎన్ని సంవత్సరాలైన పాడైపోని ఆహార పదార్థం తేనె. అయితే దీన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెడతారు కొందరు. ఇలా చేయడం వల్ల తేనె రుచి మారడమే కాక ఏకంగా గడ్డ కట్టేసే ప్రమాదముంది. అలా గడ్డ కట్టడం దాని సహజత్వానికి విరుద్ధం. ఫలితంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు: అవసరానికి మించి ఉల్లిపాయలను కట్ చేయడం.. ఆపై వాటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేయడం అసలు మంచిది కాదు. ఇంకా ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలపైన కూడా ప్రభావం ఉంటుంది.

టమోటా: టమెటాలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల టేస్ట్‌ మారిపోతుంది. ఇంకా అధికంగా చల్లబడిపోయి వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌ ఉంటే కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురులా మారిపోతాయి.

అరటి పండ్లు: అరటి పండ్లని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా వాటిలోని ఎంజైమ్స్ కరిగిపోయి ఆనారోగ్యానికి దారి తీస్తాయి.

పచ్చళ్లు: పచ్చళ్లను తడి చేతులతో పట్టుకుంటే పాడైపోయినట్లుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కూడా చల్లదనానికి త్వరగా చెడిపోతాయి.

గుడ్లు: ఉడికించిన గుడ్లును ఫ్రిడ్జ్‌లో పెట్టడం కూడా మంచిది కాదు. అలా పెట్టడం వల్ల పెద్దగా అయ్యి, చీలికలు ఏర్పడి లోపల బ్యాక్టీరియాకు కారణమవుతుంది. కాబట్టి గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టకండి.

ఫ్రైడ్ ఫుడ్స్: ఫ్రై చేసిన ఆహారాలను కూడా ఫ్రీడ్జ్‌లో పెట్టకూడదు. అలా ఫ్రీడ్జ్‌లో పెట్టిన వేపుడు ఆహారాలను తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధుల, ఊబకాయం, వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..