Viral Video: వామ్మో ఇవేం వైల్డ్ సెలబ్రేషన్స్ సామీ.. ఏకంగా వారికి బ్యాట్ చూపించిన కోహ్లీ.. వైరల్ వీడియో..

Virat Kohli's 47th Half-century: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 47వ అర్ధశతకం సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్ 50 పరుగులు చేశాడు.

Viral Video: వామ్మో ఇవేం వైల్డ్ సెలబ్రేషన్స్ సామీ.. ఏకంగా వారికి బ్యాట్ చూపించిన కోహ్లీ.. వైరల్ వీడియో..
Virat Kohli Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2023 | 5:21 PM

Virat Kohli’s 47th Half-century Reaction: ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లి మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 147.06గా నిలిచింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లి హాఫ్ సెంచరీ (61) సాధించాడు. అదే సమయంలో, ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో, కోహ్లి తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత చాలా దూకుడుగా స్పందించాడు.

కింగ్ కోహ్లీ షాకింగ్ రియాక్షన్..

ఐపీఎల్ 2023లో వరుసగా రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా స్పందించాడు. కింగ్ కోహ్లి స్పందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, కోహ్లి చాలా కోపంగా కనిపించాడు. తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్న వీడియో చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సెంచరీ తర్వాత గుండెను బలంగా గుద్దుతూ.. పెవిలియన్ వైపు బ్యాట్ చూపిస్తూ.. సెలబ్రేట్ చేసుకున్నాడు. ఢిల్లీపై ఈ అర్ధ సెంచరీ ద్వారా కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 47వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2023లో మూడో హాఫ్ సెంచరీ..

ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేశాడు. ఆ తర్వాత KKR తో జరిగిన మ్యాచ్‌లో, అతని బ్యాట్ నుంచి 21 పరుగుల ఇన్నింగ్స్ వచ్చింది. అప్పుడు లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన కోహ్లి ఇప్పుడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులు చేశాడు.

ఐపీఎల్ కెరీర్..

విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 227 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 219 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన అతను 36.76 సగటు, 129.65 స్ట్రైక్ రేట్‌తో 6838 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి మొత్తం 5 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు వచ్చాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..