DC vs MI: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఇకనైనా అత్యుత్తమ ఆటతో అదరగొట్టాల్సిందే.. లిస్టులో ఐదుగురు..

IPL 2023, DC vs MI: ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

DC vs MI: మరీ ఇలా అయితే ఎలా గురూ.. ఇకనైనా అత్యుత్తమ ఆటతో అదరగొట్టాల్సిందే.. లిస్టులో ఐదుగురు..
Mi Vs Dc
Follow us
Venkata Chari

|

Updated on: Apr 11, 2023 | 4:17 PM

Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ తొలి విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఢిల్లీ నాల్గవ మ్యాచ్‌లో బరిలోకి దిగగా, ముంబై మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్ల ఆటతీరుపైనే అందరి చూపు ఉండనుంది.

రోహిత్ శర్మ:

ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. జట్టుతో పాటు రోహిత్ శర్మ ఫామ్ కూడా దారుణంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతని బ్యాట్ సైలెంట్‌గా కనిపించింది. RCBతో జరిగిన మొదటి మ్యాచ్‌లో, CSKతో ఆడిన మ్యాచ్‌లో అతను 1, 21 పరుగులు మాత్రమే చేశాడు.

సర్ఫరాజ్ ఖాన్:

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈరోజు అతనికి అవకాశం వస్తే అందరి చూపు సర్ఫరాజ్ ప్రదర్శనపైనే ఉంటుంది. అతను ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 4, 30 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

రోవ్‌మన్ పావెల్:

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పటివరకు అతను రెండు మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ చేస్తూ 1, 2 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌ వారికి కీలకంగా మారనుంది.

సూర్యకుమార్ యాదవ్:

ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నాడు. మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఫ్లాప్‌గా కనిపించాడు. బెంగళూరుపై 15 పరుగులు, చెన్నైపై 1 పరుగు మాత్రమే చేశాడు.

కామెరాన్ గ్రీన్:

ఐపీఎల్ 2023 కోసం ముంబై ఇండియన్స్ రూ.17.50 కోట్ల భారీ ధర చెల్లించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గ్రీన్ విఫలమయ్యాడు. RCBతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 5 పరుగులు, బౌలింగ్‌లో 30 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కాగా రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 12 పరుగులు, బౌలింగ్‌లో 3 ఓవర్లలో 20 పరుగులు వికెట్ పడగొట్టలేకపోయాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!