IPL 2022: ధోని స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! వచ్చే ఏడాది సీఎస్‌కే రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.!
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022లో అన్ని జట్ల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే మరో రెండు జట్ల బిడ్డింగ్ పూర్తి కాగా..
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022లో అన్ని జట్ల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే మరో రెండు జట్ల బిడ్డింగ్ పూర్తి కాగా.. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ టోర్నీలో 10 జట్లు పాల్గొననున్నాయి. రెండు కొత్త జట్ల రాకతో మొత్తం టోర్నీ మారిపోనుంది. జనవరిలో జరగబోయే మెగా ఆక్షన్‌కు ముందు ప్రతీ జట్టు 4 ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ వరకు డెడ్‌లైన్ కూడా విధించింది. ఈ నేపధ్యంలో ఫ్రాంచైజీల వారీగా ప్లేయర్స్ జాబితా ఎలా ఉండబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్.. వచ్చే ఏడాది రాజస్థాన్ రాయల్స్‌ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లనున్నాడని సమాచారం. సంజూ శాంసన్ తాజాగా రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేసి.. చెన్నై సూపర్ కింగ్స్ అకౌంట్స్‌ను ఫాలో చేయడంతో ఈ వార్తలను మరింత బలోపేతం చేస్తోంది.
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని స్థానాన్ని సంజూ శాంసన్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అట్టేపెట్టుకున్నా.. అతడు కోచింగ్ సిబ్బందిలోనూ లేదా మెంటార్‌గానో ఉండే అవకాశం ఉంది. కాబట్టే వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్‌ను తీర్చిదిద్దాలని సీఎస్‌కే ఫ్రాంచైజీ భావిస్తోందట. అటు డుప్లెసిస్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్‌లను చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Also Read:
3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?
Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్షన్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!
Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!