AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH: మళ్లీ గాయపడిన వాషింగ్టన్ సుందర్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు వరుస ఓటములతో డీలా పడ్డ జట్టకు ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.

SRH: మళ్లీ గాయపడిన వాషింగ్టన్ సుందర్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం..
Washington Sundar
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: May 03, 2022 | 7:18 AM

Share

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు వరుస ఓటములతో డీలా పడ్డ జట్టకు ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. అతను మళ్లీ గాయపడ్డాడు. ఇదివరకే గాయంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా గాయం(Injury)తో మరోసారి జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సుందర్ గాయపడ్డాడు. బౌలింగ్ చేసే చేతికే గాయం కావడం వల్ల.. మ్యాచ్‌లో సన్​రైజర్స్​పై తీవ్ర ప్రభావం పడింది. పార్ట్ టైమ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. సుందర్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ.. రెండు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు.

కాగా, ఇదివరకు గాయం అయిన చోటే సుందర్‌కు ఇప్పుడు మళ్లీ గాయమైందని సన్​రైజర్స్ కోచ్ టామ్ మూడీ తెలిపాడు. గత గాయం నుంచి సుందర్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. అయితే దాన్ని తిరగబెట్టే స్థాయిలో ప్రస్తుత గాయం లేదని స్పష్టం చేశాడు. కుట్లు వేయాల్సిన అవసరం లేకపోవచ్చని అన్నాడు. అయితే, అతడు బౌలింగ్ చేసే పరిస్థితుల్లో కూడా లేడని చెప్పాడు. అతడు లేకపోవడం తమకు తీరని లోటు అని చెప్పుకొచ్చాడు. సన్​రైజర్స్ తన తర్వాతి మ్యాచ్‌ను దిల్లీతో ఆడనుంది. మూడీ వ్యాఖ్యలను బట్టి ఈ మ్యాచ్‌కు సుందర్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Read Also..  KKR Vs RR: రాణించిన నితీష్ రాణా, రింక్‌ సింగ్‌.. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై కోల్‌కత్తా గెలుపు..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!