KKR Vs RR: రాణించిన నితీష్ రాణా, రింక్ సింగ్.. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై కోల్‌కత్తా గెలుపు..
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లకు 5 వికెట్ల్ కోల్పోయి 153 పరుగలు చేసింది. రాజస్థాన్ విధించిన 153 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో నితీశ్ రాణా 48 రింకూ సింగ్ 42 పరుగులుతో నాటౌట్‌గా నిలువగా.. శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో రాణించాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, రింకూ సింగ్ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్‌లో ఒక పరుగు అవసరం కాగా, నితీశ్ సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ సేన్ తలో వికెట్ తీశారు. ఇక శ్రేయస్ సేనకు 5 పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నాలుగింట్లో గెలిచింది. కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకోవాలంటే మిగతా అన్ని మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.
కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. శాంసన్ (54) హాఫ్ సెంచరీతో రాణించాండు. పడిక్కల్ 2, బట్లర్ 22, కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19 తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో హెట్‌హ్మెయర్ 13 బంతుల్లో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 1/24, అనుకుల్ రాయ్ 1/28, శివమ్ మావి 1/33, సౌథీ 2/46 రాణించారు.
Read Also.. CSK vs SRH Score, IPL 2022: హైదరాబాద్ ముందు భారీ టార్గెట్.. ధోనీ జట్టు చెక్ పెట్టేనా..?