MS Dhoni: కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించిన ఎంఎస్ ధోని.. వయస్సులో కూడా రికార్డే..
MS ధోని IPL 2022 ప్రారంభానికి ముందు CSK కెప్టెన్సీని విడిచిపెట్టాడు. కానీ 8 మ్యాచ్‌ల తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ధోని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
Updated on: May 03, 2022 | 7:18 AM

ఐపీఎల్‌లో అత్యధిక కాలం కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. 2008లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతను 2017 సీజన్‌లో మాత్రమే పుణెకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఇప్పటి వరకు 205 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో 122 విజయాలు అతని ఖాతాలో చేరాయి.

జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేక పోవడంతో సీజన్ మధ్యలో మళ్లీ ఆ జట్టు ఆశ్చర్యపరిచింది. జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మళ్లీ ధోనీ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో ఈ రెండో నిర్ణయం కూడా ఐపీఎల్‌లో రికార్డు సృష్టించింది. MS ధోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్సీని స్వీకరించాడు.

ఈ విషయంలో మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ 9 ఏళ్ల రికార్డును ధోనీ బద్దలు కొట్టాడు. చివరిసారిగా 2013లో ఐపీఎల్ ఆడిన ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని చివరి మ్యాచ్ సమయంలో అతని వయస్సు 40 ఏళ్ల 268 రోజులు. ఇప్పుడు ధోని వయస్సు 40 సంవత్సరాల 298 రోజులు.

ధోని బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌పై చెన్నై విజయం సాధించింది.