Arun Lal: 66 ఏళ్ల వయస్సులో ప్రేమ వివాహం చేసుకున్న మాజీ క్రికెటర్.. వైరల్ అవుతున్న ఫొటోలు..
భారత క్రికెట్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్(Arun lal) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 66 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్‌కి ఇది రెండో పెళ్లి(Marriage). అరుణ్ లాల్ పెళ్లి చేసుకున్న మహిళ పేరు బుల్బుల్ సాహా(bulbul saha)...
భారత క్రికెట్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్(Arun lal) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 66 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్‌కి ఇది రెండో పెళ్లి(Marriage). అరుణ్ లాల్ పెళ్లి చేసుకున్న మహిళ పేరు బుల్బుల్ సాహా(bulbul saha). బుల్బుల్ వయసు అరుణ్ లాల్ కంటే 28 ఏళ్లు తక్కువ. అరుణ్ లాల్, బుల్బుల్ సాహా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. కోల్‌కతాలో అరుణ్ లాల్, బుల్బుల్ సాహా పెళ్లి చేసుకున్నారు. కోల్‌కతాలోని ఓ హోటల్‌లో జరిగిన వివాహ వేడుక జరిగింది. పెళ్లి దుస్తుల్లో కనిపించిన అరుణ్ లాల్, బుల్బుల్ సాహా చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరుణ్ లాల్ భారత్ తరఫున 16 టెస్టులు, 13 వన్డేలు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో, అతను 26 కంటే ఎక్కువ సగటుతో 729 పరుగులు చేశాడు. వన్డేల్లో 122 పరుగులు చేశాడు. అతను టెస్టుల్లో 6 హాఫ్ సెంచరీలు సాధించగా, వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
బెంగాల్ క్రికెట్ ప్రస్తుత కోచ్ అరుణ్ లాల్ వివాహ వేడుకలను నిర్వహించి బుల్బుల్ సాహాతో కేక్ కట్ చేసి ఈ ప్రత్యేక క్షణాన్ని మరింత రొమాంటిక్ గా మార్చారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు. అరుణ్ లాల్ భార్య బుల్బుల్ సాహా వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయురాలు. పిల్లలకు స్కూల్లో చదువు చెప్పడమే కాకుండా వంట చేయడం అంటే ఆమెకు ఇష్టమట. మూడేళ్ల క్రితం వంటల పోటీలో కూడా పాల్గొంది. అరుణ్ లాల్ మొదటి భార్య పేరు రీనా, రీనా ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆమె నుంచి భారత క్రికెటర్ విడాకులు తీసుకున్నాడు. అరుణ్ లాల్ తన అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నాడు.
Read Also.. KKR Vs RR: రాణించిన నితీష్ రాణా, రింక్ సింగ్.. ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై కోల్‌కత్తా గెలుపు..