IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2022 ప్రారంభం ఎప్పుడంటే.?

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది....

IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2022 ప్రారంభం ఎప్పుడంటే.?
IPL 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. IPL ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును బీసీసీఐకి సమర్పించేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉంది. దీని తరువాత అధికారిక ప్రకటన రానుంది. ముఖ్యంగా, IPL 2022లో రెండు కొత్త జట్లు పాల్గొంటాయి. 15వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి లక్నో, అహ్మదాబాద్‌లు కూడా పోటీపడతాయని బీసీసీఐ అక్టోబర్ 25న ప్రకటించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు పోటీపడనున్నాయి. కాబట్టి IPL 2022కి ముందే మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 12:22 PM

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇండియాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా 2022, ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కానుందట. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలబడనున్నట్లు సమాచారం. జూన్ 4 లేదా 5వ తేదీన ఐపీఎల్ ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనుండగా.. మొత్తంగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయట. మరి దీనిపై పూర్తి సమాచారం తెలియాలంటే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఐపీఎల్ 2022 రిటైన్ రూల్స్, మెగా ఆక్షన్ డేట్, సమయం…

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-15వ సీజన్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఇప్పుడున్న 8 జట్లతో పాటు కొత్తగా మరో రెండు జట్లు పాల్గొనబోతుండటంతో టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది. అలాగే సీజన్ ప్రారంభం కంటే ముందు మెగా ఆక్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు నలుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకుంటారు. ఇక ఆ లిస్టు మొత్తాన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 31న రిలీజ్ చేస్తాయి. ఆ తర్వాత రెండు కొత్త జట్లు విడుదలైన జాబితా నుంచి గానీ ఆక్షన్‌లోకి వచ్చిన ఆటగాళ్లలో నుంచి ముగ్గురిని గానీ డిసెంబర్ 25లోగా ఎంపిక చేసుకుంటాయి.

ఈ రిటైన్ పాలసీలో రైట్ టు మ్యాచ్(RTM) కార్డు ఆప్షన్ లేకపోగా.. ఫ్రాంచైజీలు ఆ వెసులుబాటును ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. కాగా, ప్రముఖ జాతీయ స్పోర్ట్స్ మీడియా ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ ఇచ్చిన నివేదికలు ప్రకారం జనవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా ఆక్షన్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ ఎప్పుడు.? ఎక్కడ జరుగుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆక్షన్, ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో ప్రసారం కానున్నాయి.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?