Ind Vs Nz: గ్రీన్ పార్క్‎లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. కీలక సూచనలు చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీంఇండియా ఆటగాళ్లు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో మంగళవారం నెట్స్‎లో ప్రాక్టీస్ చేశారు. అజింక్యా రహానే నేతృత్వంలో భారత ఆటగాళ్లు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‎లో పాల్గొన్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‎ను కోచ్ రాహుల్ ద్రవిడ్ నిశితంగా పరిశీలించాడు...

Ind Vs Nz: గ్రీన్ పార్క్‎లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. కీలక సూచనలు చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్..
India
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 24, 2021 | 8:04 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీంఇండియా ఆటగాళ్లు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో మంగళవారం నెట్స్‎లో ప్రాక్టీస్ చేశారు. అజింక్యా రహానే నేతృత్వంలో భారత ఆటగాళ్లు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‎లో పాల్గొన్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‎ను కోచ్ రాహుల్ ద్రవిడ్ నిశితంగా పరిశీలించాడు. నవంబర్ 25 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఛెటేశ్వర పుజారా, ఇతర సీనియర్ బ్యాటర్‌లకు ద్రవిడ్ కొన్న సూచనలు చేశాడు. జయంత్ యాదవ్‌తో పాటు ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ నెట్స్‎లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.

కేఎల్ రాహుల్ టెస్టు సిరీస్‌కు దూరం అవడంతో సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ ద్రవిడ్ కూడా నెట్స్ వద్ద సూర్యకుమార్ యాదవ్‎కు పలు సూచనలు చేశాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో పాటు విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్‌కు దూరమవడంతో భారత్‌లో చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండా పోయారు. రాహుల్‌ గాయంతో తప్పుకోవటంతో శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌తో కలిసి భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

హనుమ విహారి గైర్హాజరీతో మిడిల్ ఆర్డర్‎లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌ ఆడే అవకాశం ఉంది. భారత స్పిన్ త్రయం ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్,రవీంద్ర జడేజా కూడా ప్రాక్టీస్ చేశారు. ముంబైలో శిక్షణ ప్రారంభించిన కెప్టెన్ కోహ్లీ డిసెంబర్ 3 నుంచి వాంఖడే స్టేడియంలో ప్రారంభమయ్యే 2వ టెస్టులో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.టీ20 సిరీస్‎లో భారత్ 3-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది.

Read Also.. IPL 2022: ఆర్సీబీ ఆ నలుగురిని రిటైన్ చేసుకుంటుంది.. ఆకాశ్ చోప్రా..