IPL 2022: ఆర్సీబీ ఆ నలుగురిని రిటైన్ చేసుకుంటుంది.. ఆకాశ్ చోప్రా..
రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆర్సీబీ ఎవరిని ఉంచుకోబోతుందో భారత మాజీ ఆటగాడు చోప్రా చెప్పాడు....
రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆర్సీబీ ఎవరిని ఉంచుకోబోతుందో భారత మాజీ ఆటగాడు చోప్రా చెప్పాడు. ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్‌లలో ఎవరినైనా ఎంచుకోవడంలో మేనేజ్‌మెంట్ డైలమాలో పడొచ్చని తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా వివరించాడు. “విరాట్ కోహ్లీ, యూజీ చాహల్. మరో ఇద్దరు నా చేతిలో ఉంటే, నేను మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్‌ను ఉంచడానికి ప్రయత్నిస్తాను. వీరే నా నలుగురు ఆటగాళ్లు” అని చోప్రా పేర్కొన్నాడు.
“ఆర్సీబీ జట్టు యాజమాన్యం విరాట్ కోహ్లి, యుజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, దేవ్‌దత్ పడిక్కల్‌లను రిటెయిన్ చేసుకుంటుంది. జట్టు భవిష్యత్ అవసరాల రీత్యా చూస్తే మహమ్మద్ సిరాజ్‌ను.. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే హర్షల్ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది.” అని చెప్పాడు. సిరాజ్, హర్షల్‌ల మధ్య ఎంపిక చేసుకునేటప్పుడు మేనేజ్‌మెంట్ వారి విజన్‌ని చూడవలసి ఉంటుందన్నారు. “మీరు సిరాజ్‌ను దీర్ఘకాల దృష్టిలో చూడవచ్చు. గత 12 నెలల్లో హర్షల్ చాలా బాగా ఆడుతున్నాడు” అని చోప్రా చెప్పాడు.
తన జాబితా నుండి ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను చోప్రా మినహాయించాడు. గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకపోవచ్చని చెప్పాడు. “మాక్సీపై నాకు 100% నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. అతను బాగానే ఆడుతున్నాడు కానీ అతను దానిని కొనసాగిస్తాడా లేదా అనేది కచ్చితంగా తెలియదు” అని చోప్రా చమత్కరించాడు. IPL 2021 సమయంలో RCB లీగ్ పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఓటమి పాలైన బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌ల నుండి నిష్క్రమించింది.
Read Also.. Cricket News: 10 ఓవర్లలో10 పరుగులు మాత్రమే.. 50 పరుగులకే జట్టు మొత్తం ఆలౌట్..?