హరారేలో జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయర్ 5వ మ్యాచ్‌లో అమెరికా ఘోరంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. బదులుగా అమెరికా జట్టు కేవలం 52 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ 270 పరుగుల తేడాతో గెలిచింది.