IPL 2021: ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు సరికొత్త రూల్.. బౌలర్లకు భారంగా మారనుందా?
భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్ 14 వ సీజన్.. సగం మ్యాచులు అవ్వగానే కరోనా కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో మిగిలిన మ్యాచులు నిర్వహించి, ఐసీఎల్‌ను పూర్తిచేయాలని ప్లాన్ చేసిన బీసీసీఐ ..
IPL 2021: భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్ 14 వ సీజన్.. సగం మ్యాచులు అవ్వగానే కరోనా కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో మిగిలిన మ్యాచులు నిర్వహించి, ఐసీఎల్‌ను పూర్తిచేయాలని ప్లాన్ చేసిన బీసీసీఐ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా మిగిలిని మ్యాచులను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 15 వరకు జరిగే ఈ టోర్నీలో మిగిలిన 31 మ్యాచులు నిర్వహించనున్నారు. అలాగే తొలి దశలో ఎదురైన సమస్యలకు కూడా యూఏఈలో చెక్ పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం బీసీసీఐ సరికొత్త రూల్స్‌ని రెడీ చేసిందంట. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరింత పకడ్బందీగా రూల్స్ సిద్ధం చేసిందంట. వాటిలో ముఖ్యమైంది ఏంటంటే.. బ్యాట్స్‌మెన్ బంతిని స్టాండ్స్‌లోకి కొడితే.. మరలా ఆ బంతిని ఉపయోగించ కూడదనే సరికొత్త రూల్‌ను తీసుకొచ్చింది. గ్రౌండ్ బయట పడే బంతులను ఇతరులు ముట్టుకునే అవకాశం ఉండడంతో.. వాటితో కరోనా సోకో ప్రమాదం ఉందని, అందుకే అలాంటి బాల్స్‌ను ఇకపై వాడొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ బాల్ స్థానంలో కొత్త బంతిని ఉపయోగించనున్నారంట. ఈమేరకు బీసీసీఐ ప్రతిపాదించిన సరికొత్త రూల్ ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి. యూఏఈలో జరిగే ఐపీఎల్ సెకెండ్ ఫేస్ మ్యాచ్‌ల స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. అందుకే ఇలాంటి రూల్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది.
అయితే ఈ రూల్‌తో బ్యాట్స్‌మెన్లకు పండుగలా మారనుంది. మరోవైపు బౌలర్లకు కొంత గుబులు పెట్టనుంది. ఎందుకంటే కొత్తబంతి హార్డ్‌గా ఉంటూ ఈజీగా బ్యాట్‌పైకి వస్తుంది. అలాగే యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అసలే టీ20లు.. బ్యాట్స్‌మెన్లు బాల్స్‌ను బౌండరీల అవతలకు తరలించే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్త బాల్ వచ్చిన ప్రతీసారి బౌలర్లు ప్లాన్ మార్చుకోవాల్సి ఉంటుంది. బంతిపై పట్టు తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బౌలర్లకు శిక్షగా మారిన ఈ రూల్‌తో.. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read: Viral Video: కన్నడ టీచర్ అవతారమెత్తిన రాహుల్ ద్రవిడ్.. మాకు నేర్పించాలంటూ నెటిజన్ల రిక్వెస్టులు
Bangladesh vs Australia: బంగ్లా దెబ్బకు ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. వరుసగా రెండో సిరీస్‌లో ఓటమి