AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket In Olympics: క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇకపై ఒలింపిక్స్‌లో జెంటిల్‌ మెన్‌ గేమ్‌.

Cricket In Olympics: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఒక్కసారిగా ఒలింపిక్స్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే...

Cricket In Olympics: క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఇకపై ఒలింపిక్స్‌లో జెంటిల్‌ మెన్‌ గేమ్‌.
Cricket In Olympics
Narender Vaitla
|

Updated on: Aug 10, 2021 | 11:19 AM

Share

Cricket In Olympics: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఒక్కసారిగా ఒలింపిక్స్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే అన్ని రకాల ఆటలు ఉండే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ మాత్రం ఎందుకు లేదన్న ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇది కార్యరూపం దాల్చడడం లేదు. గతంలో 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ అనంతరం దానిని కొనసాగించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) క్రికెట్‌ అభిమానులకు పండగా లాంటి వార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు అంగీకారం తెలపలేదు. కానీ ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎనిమిది టీమ్‌ల మధ్య పోరు ఉండనున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఫార్మట్‌ విషయానికొస్తే టీ 20 లేదా టీ 10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Ghost Town: భారతదేశపు చివరి రహదారి రహస్యాలతో నిండి ఉంది.. అందుకే ఇది దెయ్యం పట్టణం

India – UAE flight: హైదారాబాద్‌ టు షార్జా… 180 మంది ప్రయాణించే విమానంలో ముగ్గురే ప్రయాణికులు.

Bharat Darshan Tour: దేశంలోని ప్రముఖ ప్రాంతాలను తక్కువ ధరతో చూసే అవకాశం కల్పిస్తూ స్పెషల్ ట్రైన్.. వివరాల్లోకి వెళ్తే..