27 మిలియన్ ట్వీట్లు: IPL 2019

ఐపీఎల్‌లో భాగంగా ట్విట్టర్‌లో ట్వీట్లు వెల్లువెత్తాయి. ఈ 12వ సీజన్‌లో మొత్తం 27 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇది 44శాతం అధికం. ఇవి మార్చి 1 నుంచి మే 13వరకు నమోదైనవి. మెన్షన్స్‌ విషయానికి వస్తే దాదాపు 63శాతం ముంబై ఇండియన్స్‌కు రాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 37శాతం వచ్చాయి. ఇక 2019 సీజన్‌లో అత్యధికంగా ఏదైనా టీం గురించి ట్వీట్లు చేశారు అంటే అది చెన్నై సూపర్‌ కింగ్స్‌ పైనే. ఆ […]

27 మిలియన్ ట్వీట్లు: IPL 2019
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 14, 2019 | 7:21 PM

ఐపీఎల్‌లో భాగంగా ట్విట్టర్‌లో ట్వీట్లు వెల్లువెత్తాయి. ఈ 12వ సీజన్‌లో మొత్తం 27 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇది 44శాతం అధికం. ఇవి మార్చి 1 నుంచి మే 13వరకు నమోదైనవి. మెన్షన్స్‌ విషయానికి వస్తే దాదాపు 63శాతం ముంబై ఇండియన్స్‌కు రాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 37శాతం వచ్చాయి. ఇక 2019 సీజన్‌లో అత్యధికంగా ఏదైనా టీం గురించి ట్వీట్లు చేశారు అంటే అది చెన్నై సూపర్‌ కింగ్స్‌ పైనే. ఆ తర్వాత స్థానంలో ముంబయి ఇండియాన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఉన్నాయి. అత్యధికంగా రీట్వీట్‌ అయిన ట్వీట్‌ మాత్రం హార్దిక్‌పాండ్యాదే. ‘‘నా స్పూర్తి, నా మిత్రుడు, నా సోదరుడు, నా లెజెండ్‌ ఎంఎస్ ధోనీ’’ అని హార్దిక్‌ పాండ్యా మే8వ తేదీన చేసిన ట్వీట్‌ 16 వేల సార్లు రీట్వీట్‌ చేశారు.