కృష్ణా..అంతా నీ లీలేనయ్యా! ఐపీఎల్ ట్రోఫీతో నీతూ పూజలు
ముంబయి: ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బాల్‌కు విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ముంబయి ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ. రోహిత్ సేన కుటుంబ సభ్యులకు యాంటిలియాలో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారామె. ఆ పార్టీకి ముందు శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రార్థనలు చేశారు. ఆమె నివాసంలోని కృష్ణుడి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీని ఉంచి పూజలు నిర్వహిస్తోన్న వీడియోను విరల్ భయాని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. […]
ముంబయి: ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బాల్‌కు విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ముంబయి ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ. రోహిత్ సేన కుటుంబ సభ్యులకు యాంటిలియాలో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారామె. ఆ పార్టీకి ముందు శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రార్థనలు చేశారు. ఆమె నివాసంలోని కృష్ణుడి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీని ఉంచి పూజలు నిర్వహిస్తోన్న వీడియోను విరల్ భయాని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ‘జై శ్రీ కృష్ణ’ అని స్మరించారు. అక్కడే ఉన్న పూజారులు ఆమె వద్ద నుంచి ట్రోఫి అందుకొని దేవుడి ముందు ఉంచారు. కొద్దిసేపు ప్రార్థనల్లో పాల్గొని , తరవాత ముంబయి ఇండియన్స్ జట్టుతో పార్టీలో మునిగిపోయారు.