ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు రద్దు

ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు రద్దు

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ ఆరంభ వేడుకలు రద్దయ్యాయి. కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఏటా ఐపీఎల్‌ సీజన్‌ మొదటి రోజు బాలీవుడ్‌ నటీనటులు, గాయకులతో అద్భుతమైన వేడుకలు నిర్వహించే సంగతి తెలిసిందే. మిరుమిట్లు గొలిపే బాణసంచా కాలుస్తారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల గౌరవార్థం ఈ సారి వేడుకలు రద్దుచేశారు. ‘ఈ సారి ఐపీఎల్‌ ఆరంభ వేడుక నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును […]

Ram Naramaneni

|

Mar 19, 2019 | 3:55 PM

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్‌ ఆరంభ వేడుకలు రద్దయ్యాయి. కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఏటా ఐపీఎల్‌ సీజన్‌ మొదటి రోజు బాలీవుడ్‌ నటీనటులు, గాయకులతో అద్భుతమైన వేడుకలు నిర్వహించే సంగతి తెలిసిందే. మిరుమిట్లు గొలిపే బాణసంచా కాలుస్తారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల గౌరవార్థం ఈ సారి వేడుకలు రద్దుచేశారు.

‘ఈ సారి ఐపీఎల్‌ ఆరంభ వేడుక నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం’ అని క్రికెట్‌ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ తెలిపారు. మార్చి 23న ఐపీఎల్‌ 12వ ఎడిషన్‌ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి. టోర్నీ నిర్వాహకులు రెండు వారాల షెడ్యూలును మాత్రమే విడుదల చేశారు. 17 మ్యాచ్‌ల వివరాలు అందులో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత మార్పుచేర్పులతో పూర్తి మ్యాచ్‌ల జాబితా ప్రకటించనున్నారు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu