IPL 2023: రూ. 4.80 కోట్ల నుంచి 60 లక్షలకు.. కట్‌ చేస్తే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 రన్స్‌.. రికార్డు బద్దలు

బౌల్ట్‌, అశ్విన్‌, చాహల్‌ వంటి ఇంటర్నేషనల్‌ బౌలర్లను చీల్చిచెండాడిన ప్రబ్‌సిమ్రన్‌ కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం కొట్టాడు. మ్యాచ్‌మొత్తం మీద 34 బంతులు ఎదుర్కొన్న సింగ్‌ 60 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్‌ బౌలర్‌ కేఎం ఆసిఫ్ వేసిన ఒకే ఓవర్‌లో 3 ఫోర్లు, ..

IPL 2023: రూ. 4.80 కోట్ల నుంచి 60 లక్షలకు.. కట్‌ చేస్తే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 రన్స్‌.. రికార్డు బద్దలు
Prabhsimran Singh
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2023 | 5:55 AM

ఐపీఎల్‌ 2023లో భాగంగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్‌ పంజాబ్‌కింగ్స్‌తో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యంగ్‌ బ్యాటర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనే పంజాబ్‌ ఓపెననర్‌ ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌. బౌల్ట్‌, అశ్విన్‌, చాహల్‌ వంటి ఇంటర్నేషనల్‌ బౌలర్లను చీల్చిచెండాడిన ప్రబ్‌సిమ్రన్‌ కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం కొట్టాడు. మ్యాచ్‌మొత్తం మీద 34 బంతులు ఎదుర్కొన్న సింగ్‌ 60 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్‌ బౌలర్‌ కేఎం ఆసిఫ్ వేసిన ఒకే ఓవర్‌లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో మొత్తం19 పరుగులు పిండుకున్నాడీ యంగ్ బ్యాటర్‌. పంజాబ్‌ మొదట చేసిన 68 పరుగుల్లో ప్రబ్‌సిమ్రన్‌వే 50 పరుగులు కావడం గమనార్హం. అంతలా రెచ్చిపోయాడీ యంగ్‌ క్రికెటర్‌. ఇలా అంతర్జాతీయ బౌలర్లను తనదైనశైలిలో ఉతికారేసిన ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ ఆటకు క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అదే సమయంలో ఎవరీ క్రికెటర్ అని ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా పాటియాలలో పుట్టిన ప్రబ్‌సిమ్రన్‌ 2018లో దేశవాలీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాదే 18 ఏళ్ల వయసులోనే 2019లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పంజాబ్ అతడిని వేలంలో రూ.4.80 కోట్లకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో దూకుడైన బ్యాటర్‌గా ప్రభ్‌సిమ్రాన్‌ మంచి గుర్తింపు ఉంది. 2022లో తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన ఇతను 11 మ్యాచ్‌ల్లో 689 పరుగులు చేశాడు. 24 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 664 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్‌ 42 టి20 మ్యాచ్‌ల్లో 1179 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. దీంతో 2022లో పంజాబ్ అతడిని విడుదల చేసి మళ్లీ మెగా వేలంలో కేవలం రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. IPL 2023 సీజన్ ప్రారంభానికి ముందు , ప్రభాసిమ్రాన్ కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, అందులో అతను 64 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తాజా ఇన్నింగ్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..