IND vs AUS: పెర్త్‌లో హీరో.. అడిలైడ్‌లో జీరో.. మరి గబ్బాలో గర్జించేనా? కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Virat Kohli: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య గబ్బా మైదానంలో మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయంపైనే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కలలు ఆధారపడి ఉన్నాయి. కానీ, గబ్బాలో విరాట్ కోహ్లీ పేలవమైన గణాంకాలు జట్టును ఆందోళనకు గురిచేశాయి.

IND vs AUS: పెర్త్‌లో హీరో.. అడిలైడ్‌లో జీరో.. మరి గబ్బాలో గర్జించేనా? కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసా?
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Dec 11, 2024 | 11:59 AM

Virat Kohli’s Stats and Records at Gabba Stadium: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కల చెదిరిపోతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కల సజీవంగా ఉంటుంది. దీనికి తోడు గబ్బా వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. కాబట్టి, గతసారి విజయం సాధించిన స్ఫూర్తితో టీమిండియా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు ఈ గబ్బా మైదానంలో టీమిండియా బ్యాటింగ్‌ వెన్నుముకగా మారిన విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో చూడాలి.

నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే సెంచరీ సాధించాడు. మిగిలిన మ్యాచ్‌లలో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పుడు దీనికి తోడు గబ్బా మైదానంలో విరాట్ కోహ్లీ గణాంకాలు టీమిండియాను మరింత ఆందోళనకు గురిచేశాయి. గబ్బా మైదానంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కోహ్లీ 20 పరుగులు మాత్రమే చేశాడు.

2014లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. అంటే, ఓవరాల్‌గా ఇప్పటి వరకు గబ్బాలో కోహ్లీ 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు చాలాకాలం తర్వాత ఈ మైదానంలో ఆడేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి ఇక్కడ భారీ ఇన్నింగ్స్ ఆడాలనేది అభిమానుల ఆశ.

ఇవి కూడా చదవండి

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యు), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా , రవిచంద్రన్ అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..