AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తుస్సుమన్నది.. వెస్టిండీస్ మాజీ సారథి కీలక వ్యాఖ్యలు..

Team India: అతిపెద్ద T20 లీగ్‌ని కలిగి ఉన్న భారతదేశ ఆటగాళ్లకు ప్రపంచంలోని వివిధ లీగ్‌లలో ఆడుతున్న ఆటగాళ్లకు ఉన్న అనుభవంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వెస్టిండీస్ మాజీ సారథి కీలక వ్యాఖ్యలు చేశాడు.

T20 World Cup: అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తుస్సుమన్నది.. వెస్టిండీస్ మాజీ సారథి కీలక వ్యాఖ్యలు..
Team India
Venkata Chari
|

Updated on: Nov 14, 2022 | 5:16 PM

Share

టీ20 ప్రపంచకప్‌ 2022లో ఎన్నో ఆశలతో బరలోకి దిగిన టీమిండియాకు చుక్కెదురైంది. సెమీస్ చేరినా.. కీలక మ్యాచ్‌లో తడబడడంతో ఇంటిబాట పడ్డింది. దీంతో భారత్ ప్రదర్శనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘తమ పేలవ ప్రదర్శనకు భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌లలో ఆడకపోవడం కూడా ఒక కారణమని’ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ సోమవారం అన్నాడు. విదేశీ T20 లీగ్‌లలో ఆడటానికి టీమిండియా నుంచి క్రియాశీల ఆటగాడికి అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపాడు. 2012, 2016లో వెస్టిండీస్‌ను టీ20 ప్రపంచకప్ టైటిల్స్‌కు నడిపించిన సామీ, ఇంగ్లండ్ ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో, ముఖ్యంగా ఆస్ట్రేలియా బిగ్ బాష్‌లో ఆడటం వల్ల ప్రయోజనం పొందారని చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడే ఆటగాళ్లు నిజంగా మెరిశారని సామీ పేర్కొన్నాడు. అతిపెద్ద T20 లీగ్‌ని కలిగి ఉన్న భారతదేశ ఆటగాళ్లకు ప్రపంచంలోని వివిధ లీగ్‌లలో ఆడుతున్న ఆటగాళ్లకు ఉన్న అనుభవంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.

ఒకేసారి వన్డే, టీ20 ప్రపంచకప్‌ టైటిల్స్‌..

‘బిగ్‌బాష్‌లో ఆడే అలెక్స్‌ హేల్స్‌, క్రిస్‌ జోర్డాన్‌ వంటి ఆటగాళ్లను ఓసారి చూడండి.. వారు ఆస్ట్రేలియాలో బాగా రాణించటం యాదృచ్చికం కాదు. ఇంగ్లండ్ జట్టు అత్యంత పూర్తి జట్టు, వారు నిజంగా ఛాంపియన్లుగా అర్హులు. తమ వద్ద అత్యుత్తమ ఆల్ రౌండర్ జట్టు ఉందని అన్ని ఒత్తిడి మ్యాచ్ ల్లోనూ చూపించారు. ఆదివారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఒకే సమయంలో వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది’ అని డారెల్ సామీ తెలిపాడు. “ఇంగ్లాండ్ ఎల్లప్పుడూ పరిస్థితులకు అనుగుణంగా మారగలిగింది. పెర్త్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ, శ్రీలంక, న్యూజిలాండ్‌లపై అవసరమైన సమయంలో తమసత్తా ఏంటో రుచి చూపించారు” అని సామీ పేర్కొన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో పరిణతి అవసరం..

“సెమీ-ఫైనల్‌లో భారత్‌పై అదే ఆటతో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరింది. అలాగే ఫైనల్‌లో ఆ టీం ఆధిపత్యం చెలాయించింది. 137 పరుగులను ఛేదించి మరోసారి సత్తా చాటారు. అది బ్యాటింగ్ లైనప్‌లో పరిణతిగా చెప్పుకోవచ్చు. ఏమి చేయాలో అర్థం చేసుకోవడం, తదనుగుణంగా ఆడటం చాలా కీలకం. వారు బ్యాట్, బాల్‌తో అత్యంత అనుకూలమైన జట్టుగా మారి, విజేతలుగా నిలిచారు. ఫైనల్‌లో 49 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్టార్ ఇంగ్లండ్ ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్‌ను సామీ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ తరపున హీరోగా నిలిచాడని” చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..