ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు.. పంత్ త్వరగా కోలుకోవాలని మహా శివుడికి పూజలు
చివరి వన్డే ఆడే ముందు భారత జట్టు ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు కొందరు సహాయక సిబ్బంది ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే కోసం భారత క్రికెట్ జట్టు ఇండోర్‌కు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా కివీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈక్రమంలో నేడు మరోసారి బ్యాక్‌క్యాప్స్‌తో తలపడనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. కాగా చివరి వన్డే ఆడే ముందు భారత జట్టు ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు కొందరు సహాయక సిబ్బంది ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ త్వరగా కోలుకోవాలంటూ మహాశివుడికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శివ లింగానికి బాబా మహాకాల్ భస్మ హారతి అర్పించారు. అనంతరం బాబా మహాకాళీ ఆశీస్సులు తీసుకున్నారు. కాగా దర్శనానంతరం సూర్యకుమార్ మీడియాతో మాట్లాడాడు. ‘ బాబా మహాకాళ్ దివ్య అతీంద్రియ భస్మ హారతిలో పాల్గొనే భాగ్యం నాకు లభించినందుకు నేను ధన్యుడిని. కారు ప్రమాదానికి గురైన పంత్ త్వరగా కోలుకోవాలని మహా శివుడిని ప్రార్థించాం. ఆయన ఆశీస్సులతో పంత్ కోలుకొంటాడని ఆశిస్తున్నాం. అతను టీమిండియా జట్టులోకి తిరిగి రావడం మాకు చాలా ముఖ్యం. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే గెలిచాం.. మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చాడు సూర్య.
కాగా నేడు జరిగే మూడో వన్డేలో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడిస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. ‘మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడిస్తే వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకోనుంది’అని ట్వీట్ చేసింది ఐసీసీ. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, టీమిండియా ఖాతాల్లో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు సమంగా ఉన్నప్పటికి మ్యాచ్‌ల ఆధారంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే రెండు రేటింగ్ పాయింట్లతో మొత్తంగా 115 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉంది.
We prayed for the speedy recovery of Rishabh Pant. His comeback is very important to us. We have already won the series against New Zealand, looking forward to the final match against them: Cricketer Suryakumar Yadav pic.twitter.com/2yngbYZXfb
— ANI (@ANI) January 23, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..