స్పెషల్ మ్యాచ్‌పై ఫోకస్ చేసిన బీసీసీఐ.. ప్రపంచ దిగ్గజాలతో ఢీకొట్టనున్న టీమిండియా ఆటగాళ్లు.. ఎప్పుడంటే?
జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 20న ముగుస్తుంది. ఈ సిరీస్‌లోని కొంతమంది ఆటగాళ్లు ఆగస్టు 22న ఇండియాకు రానున్నారు. దీంతో రోహిత్, విరాట్..

ఆగస్టు 22న దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోన్న సందర్భంగా టీమిండియా వర్సెస్ ఇతర ప్రపంచ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనను సాంస్కృతిక శాఖ బీసీసీఐకి పంపింది. ‘ఆజాదీ కా అమృత్’ పండుగ ప్రచారంలో భాగంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు వర్సెస్ ప్రముఖ విదేశీ క్రికెటర్లతో ఓ మ్యాచ్ నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రతిపాదనపై చర్చ..
ఆగస్టు 22న ఇండియా 11, వరల్డ్ 11 మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వరల్డ్ 11 కోసం, మాకు కనీసం 13 నుంచి 14 మంది ఆటగాళ్లు అవసరం. కాబట్టి మేం వారి లభ్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.




అయితే, ఇదే సమయంలో ఇంగ్లీష్ దేశీయ క్రికెట్‌తోపాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ క్రికెటర్ల సేవల విషయానికొస్తే, ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్ (జులై 22-26) కోసం బీసీసీఐ ఉన్నతాధికారులు బర్మింగ్‌హామ్‌లో ఉంటారు. అక్కడ వారు తమ ఆటగాళ్లలో కొందరిని భారతదేశంలోని మ్యాచ్‌లకు విడుదల చేయడానికి ఇతర బోర్డులతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అందుబాటులో ఉండే భారత ఆటగాళ్లు..
సమాచారం ప్రకారం, ఇండియన్ ప్లేయింగ్ 11ని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 20న ముగుస్తుంది. ఈ సిరీస్‌లోని కొంతమంది ఆటగాళ్లు ఆగస్టు 22న వస్తే, అప్పుడు వారు మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. అయితే కొందరు భారత ఆటగాళ్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లరు. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తదితరులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్లు ఆగస్టు 22న అందుబాటులో ఉంటారు.




