IND vs SL 3rd T20I: తుఫాన్ సెంచరీతో సూర్య బీభత్సం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ సెంచరీతో బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ స్కోర్ 200 దాటేలా చేశాడు. దీంతో శ్రీలంక ముందు 229 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ సెంచరీతో బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ స్కోర్ 200 దాటేలా చేశాడు. అలాగే చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా 233 స్ట్రైక్ రేట్‌లో బ్యాటింగ్ చేసి 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో శ్రీలంక ముందు 229 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.
ఈ ఏడాది తొలి సెంచరీ.. కెరీర్‌లో మూడో టీ20 సెంచరీ..
ఈ ఏడాది తొలి టీ20 సెంచరీని సూర్యకుమార్ నమోదు చేశాడు. ఇది అతనికి ఓవరాల్‌గా మూడో సెంచరీ. సూర్య 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ పరంగా రోహిత్ శర్మ (35 బంతుల్లో) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.




CENTURY for @surya_14kumar
A third T20I ? in just 43 innings.
Take a bow, Surya!#INDvSL @mastercardindia pic.twitter.com/HZ95mxC3B4
— BCCI (@BCCI) January 7, 2023
దిల్షాన్ మధుశంక వేసిన బంతికి దీపక్ హుడా లాంగ్ ఆన్ హస్రంగకు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 పరుగులు, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులు, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు, ఇషాన్ కిషన్ ఒక పరుగుతో రాణించారు.
దిల్షాన్ మధుశంకకు 2 వికెట్లు దక్కాయి. కసున్ రజిత, చమిక కరుణరత్నే, హసరంగలకు ఒక్కో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




