IND Vs NZ: రోహిత్ మావ.! ఆ ఇద్దరే టీమిండియాకు డేంజర్.. త్వరగా అవుట్ చేస్తే కప్పు మనదే
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఎలాగైనా కప్ గెలవాలని రెండు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి. మరి ఆ వివరాలు ఇలా..

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మార్చి 9న దుబాయ్ వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి.. టీమిండియా ఫైనల్ చేరగా.. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని అందుకుని ఆఖరి అంకానికి చేరింది న్యూజిలాండ్. దుబాయ్ స్లో పిచ్ కావడంతో.. స్పిన్నర్లకు ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఆప్షన్‌లో కివిస్ కంటే టీమిండియానే బలంగా కనిపిస్తోంది.
ఇది చదవండి: 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు.. ఫైనల్‌లో టీమిండియాకు శనిలా దాపురించాడు.. ఎవరంటే.?
ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్లయిన కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర టీమిండియాకు డేంజర్‌గా మారనున్నారు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే.. టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్టేనని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక వీరిద్దరి కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పక్కాగా వ్యూహాలు రచిస్తున్నాడు. రచిన్‌కు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టాలని భారత బౌలర్లు చూస్తున్నారట. ఇక కేన్ విలియమ్సన్ విషయానికొస్తే.. అటు స్పిన్, ఇటు పేస్ రెండూ కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడు. గ్రూప్ స్టేజిలో టీమిండియాపై కేన్ విలియమ్సన్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. క్రీజులో కుదురుకున్నాడంటే.. మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకుంటాడు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే.. కప్పు టీమిండియాదే అంటున్నారు మాజీ క్రికెటర్లు.
ఇది చదవండి: టీమిండియాకి అన్నీ చెడు శకునములే.. ఫైనల్ ఓడితే కోట్లు పాయే.. ఎందుకంటే.?
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషబ్ పంత్
న్యూజిలాండ్ జట్టు:
విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ
ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








