IND Vs NZ: 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు.. ఫైనల్‌లో టీమిండియాకు శనిలా దాపురించాడు.. ఎవరంటే.?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ తరుణంలో రోహిత్ శర్మ అండ్ టీంకు ఓ న్యూజిలాండ్ ప్లేయర్ టెన్షన్ పెడుతున్నాడు. భారత సంతతికి చెందిన ఆ ప్లేయర్.. ఇప్పుడు ఫైనల్ లో కివిస్ జట్టుకు కీలకం కానున్నాడు. మరి అతడెవరో తెల్సా..

2025 ఛాంపియన్స్ ట్రోఫీ చివరి ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలని తహతహలాడుతుంటే.. న్యూజిలాండ్ జట్టు 25 ఏళ్ల కలను మరోసారి రిపీట్ చేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాడు.. ఇప్పుడు ఫైనల్‌లో టీం ఇండియాకు అతిపెద్ద ముప్పుగా మారబోతున్నాడు. ఆ ఆటగాడి ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. టెన్షన్ పడక తప్పేలా లేదు.
ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు అతిపెద్ద ముప్పు న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర. రచిన్ రవీంద్ర భారత సంతతి ప్లేయర్. రచిన్ రవీంద్ర నవంబర్ 18, 1999న న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ నగరంలో జన్మించాడు. కానీ అతని తల్లిదండ్రులు బెంగళూరు నుంచి వచ్చారు. రచిన్ పుట్టకముందే అతని తల్లిదండ్రులు.. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అతని తండ్రి వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. దీంతో రచిన్ రవీంద్ర న్యూజిలాండ్‌లో పెరగడంతో.. అక్కడే తన డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు.
రచిన్ రవీంద్ర ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పరిణితి చెందిన ఆటగాళ్ళలో ఒకడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాట్, బంతి రెండింటితోనూ తన జట్టుకు పెద్ద మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు. ఇది టీం ఇండియాకు పెద్ద టెన్షన్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 75.33 సగటుతో 226 పరుగులు చేశాడు. ఈ సమయంలో రచిన్ బ్యాట్ నుంచి 2 సెంచరీలు కూడా నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆపై దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా సెంచరీతో అదరగొట్టాడు. దీనితో పాటు, అతను బంతితో 2 వికెట్లు కూడా తీసుకున్నాడు.
భారత్‌పై రచిన్ గణాంకాలు..
టీం ఇండియాపై రచిన్ రవీంద్ర ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, అతను ఇప్పటివరకు 3 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ సమయంలో, రచిన్ రవీంద్ర 31.33 సగటుతో 94 పరుగులు చేశాడు. ఇందులో 1 అర్ధ సెంచరీ కూడా ఉంది. అంటే రచిన్ రవీంద్ర ఇంకా వన్డేల్లో భారత్‌పై పెద్ద ఇన్నింగ్స్‌లేవీ ఆడలేదన్న మాట.
ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




