IND Vs NZ: టీమిండియాకి అన్నీ చెడు శకునములే.. ఫైనల్ ఓడితే కోట్లు పాయే.. ఎందుకంటే.?
ఇదేందిది రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా ఓడిపోతే కోట్లు నష్టం వస్తుందా.? అసలు ఎందుకని అంటారు.? ఈ వార్త కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉంది కదా.! అయితే కంగారు పడకండి.. ఇందులో టీమిండియా పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి అనేది తెలుసుకుందామా. వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదామా..

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమయ్యాయి. ఈ మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఇదిలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టైటిల్ విజేతకు భారీగా డబ్బులు వచ్చిపడతాయి. మార్చి 9న జరిగే ఫైనల్‌కు రూ. 30 కోట్లు విజేత, రన్నరప్ మధ్య చేతులు మారనున్నాయి ఇలాంటి పరిస్థితిలో టీమిండియా ఫైనల్ గెలిస్తే ఎంత డబ్బు వస్తుంది.? ఓడిపోతే ఎంత డబ్బు ముట్టచెబుతారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా..!
ఫైనల్ విజేత, రన్నరప్ జట్టుకు మొత్తం ప్రైజ్ మనీ రూ. 29.23 కోట్లు. ఇందులో రూ.19.49 కోట్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు ఇస్తే.. రన్నరప్‌గా నిలిచే జట్టు, అంటే ఫైనల్‌లో ఓడిపోయే జట్టుకు దాదాపు రూ. 9.74 కోట్లు ఇవ్వనున్నారు. ఇది చూస్తే గెలిచిన జట్టు, రన్నరప్ జట్టు మధ్య దాదాపు రూ.10 కోట్ల(9.75 కోట్లు) అంతర్యం ఉన్నట్టే. ఒకవేళ టీం ఇండియా ఫైనల్‌లో ఓడిపోతే, ఈ మొత్తం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో టీం ఇండియా ప్రదర్శనను పరిశీలిస్తే, ఫైనల్‌లో ఓడిపోతుందని చెప్పలేం. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అన్ని కూడా దుబాయ్‌లోనే ఆడటం గమనార్హం. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, టోర్నమెంట్‌లో ఇండియా దుబాయ్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలవగా, అందులో ఒక మ్యాచ్ న్యూజిలాండ్‌తో కూడా ఉంది.
మరోవైపు దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. కానీ, ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ బలంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు రెండు ఐసీసీ ఈవెంట్లలో భారత్‌తో ఫైనల్స్ ఆడింది. రెండింటిలోనూ గెలిచింది. ఈ రెండింటిలో ఒకటి 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాగా, మరొకటి 2021 సంవత్సరంలో జరిగిన WTC ఫైనల్.
ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




